చాహల్ ను వెంటాడిన బ్యాడ్లక్.. అది నో బాల్ కాకపోయుంటేనా..?

praveen
ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల టి20 సిరీస్ లో భాగంగా మూడవ టి20 మ్యాచ్ ఆడింది భారత జట్టు. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు లక్ష్య ఛేదన చేయలేక ఓటమి చవిచూసింది అన్న విషయం తెలిసిందే. భారత ఆటగాళ్లందరూ అద్భుతంగా బాగానే రాణించినప్పటికీ కూడా 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 174 పరుగులు మాత్రమే చేయగలిగింది భారత జట్టు దీంతో ఓటమి చవిచూసింది. అయినప్పటికీ వరుసగా రెండు మ్యాచ్లలో గెలవడంతో సిరీస్ కైవసం చేసుకుంది భారత జట్టు.



 అయితే నిన్న జరిగిన మూడో వన్డే మ్యాచ్లో చాహల్ ను  దురదృష్టం వెంటాడింది... అరుదైన రికార్డును సొంతం చేసుకుందామని ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన చాహల్ ఆశలు నిన్నటి మ్యాచ్ లో ఆవిరైపోయాయి.  ఇంకా ఒక్క వికెట్ సాధిస్తే చాలు టి-20లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా రికార్డుసృష్టిస్తాడు భారత ఆటగాడు చాహల్.  ఈ క్రమంలోనే నిన్న జరిగిన మూడో టీ-20లో ఒక వికెట్ పడగొట్టిన రికార్డును సాధించాలి అని ఎంతగానో ఆత్రుతగా ఎదురు చూశాడు. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన మ్యాచ్లో 13 ఓవర్లో చాహల్ బౌలింగ్లో మాక్స్వెల్ అవుట్ అయిపోయాడు.



 దీంతో చాహల్ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు అని అందరూ అనుకున్నారు.  కానీ ఇంతలో అదృష్టం కలిసిరాక చాహల్ వేసిన బాల్ కాస్త నో బాల్ గా మారిపోయింది... దీంతో బాడ్ లక్ అతని వెంట పడడంతో వికెట్ అయినప్పటికీ నోబాల్ కారణంగా వికెట్ ఇవ్వలేదు ఎంపైర్లు. కాగా ప్రస్తుతం టీ20 లో 59 వికెట్లు తీసిన చాహల్ బుమ్రా తో  సరిసమానంగా ఉన్నాడు...  ఇలా నిన్న జరిగిన 3వ టి20 మ్యాచ్ లో ఒక వికెట్ తీసి భారత్ తరపున టీ20 లో అత్యధిక వికెట్లు తీసిన బ్యాట్మెన్గా రికార్డు సృష్టించాలని అనుకున్నప్పటికీ చాహల్ కి అది మాత్రం కుదరలేదు. దీంతో చాహల్ అభిమానులు నిరాశ చెందారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: