కోహ్లీ గెలిచాడు.. ఇక మీరు నోరు మూయండి..?
ఈ నేపథ్యంలోనే ఐపీఎల్లో ఐదుసార్లు టైటిల్ గెలిచిన కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ టీమిండియా కు కెప్టెన్ గా మార్చాలి అని డిమాండ్ ఎక్కువగా తెరమీదకు వచ్చాయి. వన్డే టి20 లకు రోహిత్ శర్మను కెప్టెన్ గా మార్చి జట్టు బాధ్యతలు అప్పగించడంతో పాటు టెస్ట్ జట్టుకు విరాట్ కోహ్లీ ని కెప్టెన్గా నియమించాలి అంటూ ఎన్నో డిమాండ్లు కూడా తెరమీదకు వచ్చాయి దీనికి సంబంధించి అటు సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు కూడా వైరల్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పించాలి అంటూ వస్తున్న వార్తలపై ఎంతో మంది మాజీలు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఇటీవల విరాట్ కోహ్లీ ని టి20 వన్డే కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పించాలి అంటూ వస్తున్న వార్తలపై స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టి20 కెప్టెన్సీ బాధ్యతలనుంచి కోహ్లీ ని తొలగించాల్సిన అవసరం లేదు అంటూ వ్యాఖ్యానించాడు. 10 టి20 లకు కెప్టెన్గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించి విజయం సాధించాడు అంటూ కృష్ణమాచారి శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోనే టీమిండియాతో టి20 గెలిచిందని కెప్టెన్సీ మార్పు కావాలనే వారు నోరు మూయండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారుకృష్ణమాచారి శ్రీకాంత్.