విజయం సాధించిన పాకిస్తాన్..!

praveen
కరోనా  వైరస్ కారణంగా అన్ని రకాల క్రీడలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే క్రికెట్ క్రీడ కూడా నిలిచిపోయింది. దాదాపు ఏడు నెలల పాటు అందరూ క్రికెటర్లు ఇంటికే పరిమితమయ్యారు. కనీసం మైదానంలో ప్రాక్టీస్ చేయడానికి కూడా ప్రభుత్వాల నుంచి అనుమతి లేకపోవడంతో ఎప్పుడు బిజీ బిజీగా ఉండే క్రికెటర్లు తమ ఫ్యామిలీతో ఎంతో సమయాన్ని గడిపారు అనే చెప్పాలి. ఇక అన్లాక్ మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో క్రీడలు కూడా ప్రారంభించు కునేందుకు అవకాశం వచ్చిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ప్రస్తుతం కఠిన నిబంధనలు మధ్య కరోనా  వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని క్రికెట్ మ్యాచ్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ప్రస్తుతం వివిధ జట్లు  ఇతర దేశాలకు పర్యటనకు వెళ్లి క్రికెట్ మ్యాచ్ లు కూడా ఆడుతున్నాయి.ప్రస్తుతం పాకిస్తాన్ జింబాబ్వే పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. అక్కడ పలు వన్డే మ్యాచ్ లతోపాటు టి20 సిరీస్ లను కూడా ఆడుతుంది  పాకిస్తాన్. ఇటీవలే జరిగిన టి20 సిరీస్ లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. మొదటి నుంచి బ్యాటింగ్ బౌలింగ్ లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ ఘన విజయాలను సొంతం చేసుకుంటూ వస్తున్న  పాకిస్థాన్.. జింబాబ్వేతో జరిగిన టి-20లో  ఘనవిజయం సాధించింది అని చెప్పాలి. తొలుత బ్యాటింగ్ కాస్త తడబడడం తో... పాకిస్తాన్ ఓడిపోతుంది అని అందరూ అనుకున్నారు.

 కాగా తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్ల కు  కేవలం 136 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. పాక్ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో జింబాబ్వే బ్యాట్స్మెన్లను తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగారు. ఇక ఆ తరువాత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ బ్యాట్స్మెన్ మొదట్లో కాస్త తడబడింది. అయినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఎంతో అద్భుతంగా రాణించింది. ఆ తర్వాత బాబర్ ఆజమ్ హైదర్ అలీ లు  అద్భుతంగా రాణించడంతో ఎంతో అలవోకగా పాకిస్థాన్ జట్టు జింబాబ్వే జట్టుపై రెండో టీ20లో ఘన విజయాన్ని సాధించింది. ఇక మరో మ్యాచ్ మిగిలి ఉండగానే పాకిస్థాన్ జట్టు సిరీస్ కైవసం చేసుకుని విజయఢంకా మోగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: