ఒక్క ఓటమితో.. హైదరాబాద్ ప్లే ఆఫ్ ఆశలు గల్లంతు..?

praveen
ఐపీఎల్ సీజన్ లో టైటిల్ ఫేవరెట్గా రంగంలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ టు మొదటినుంచి అంతకుముందు సీజన్లలో లాగా అద్భుతమైన ఫామ్  కనబర్చ  లేక వరుస  ఓటమి చవి చూస్తూ వచ్చిన విషయం తెలిసిందే. పడుతూ లేస్తూ  ప్రస్థానాన్ని కొనసాగించింది  సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.  దీంతో  ప్లే ఆఫ్ కీ అర్హత  సాధించడం అనేది ఎంతో కఠినతరం గా మారిపోయిన విషయం తెలిసిందే. గతంలో వరుస  ఓటమిలు  చవి చూడటం తో ఆడిన ప్రతీ మ్యాచ్ కూడా గెలవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ తో విజయం సాధించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లు అనిపించింది.

 ఇక నిన్న ఐపీఎల్ లో కీలకమైన మ్యాచ్ జరిగింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది ఎందుకంటే ఈ రెండు జట్లు కూడా ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సి ఉంది. ఈ క్రమంలోనే రెండు జట్లకు  కూడా డూ ఆర్ డై మ్యాచ్ గా మారిపోయింది . దీంతో ఏ జట్టు విజయం సాధిస్తుందా అని అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. ఇక రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగిన విషయం తెలిసిందే. ఇక మొదట సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో తక్కువ పరుగులకే పంజాబ్ జట్టును కట్టడి చేశారు.

 ఆ తర్వాత హైదరాబాద్ జట్టు ఓపెనర్లు రంగంలోకి దిగి మెరుపులు మెరిపించిన తీరు ఇక హైదరాబాద్ జట్టుకు విజయం ఖాయం అని అభిమానుల్లో ధైర్యాన్ని కలిగించింది. కానీ మ్యాచ్ లో ఎవరు  గెలుస్తారు అన్నది ఎంతో ఉత్కంఠగా మారింది. కానీ చివరికి 12 పరుగుల తేడాతో పంజాబ్ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే  పంజాబ్ విజయంతో ఐపీఎల్ సీజన్ లో సన్రైజర్స్ ప్లే ఆఫ్  ఆశలు  పూర్తిగా ఆవిరైపోయాయి. దీంతో హైదరాబాద్ అభిమానులందరూ తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: