భారీ సిక్సర్లు కొట్టేందుకు బలం ఎలా వచ్చిందో చెప్పిన సంజూ శాంసన్..?
ప్రస్తుతం ఐపీఎల్లో ఏ మ్యాచ్ జరిగినా సంజూ శాంసన్ విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. అందరూ సంజు శాంసన్ ఇన్నింగ్స్ ని ఉదాహరణగా తీసుకుంటున్నారు. పెద్ద పెద్ద బౌండరీలు సైతం సంజూ శాంసన్ ప్రతిభ ముందు చిన్నబోయాయి అనడంలో అతిశయోక్తి లేదు. సంజు శాంసన్ గ్రీస్లో నిలబడితే ఎక్కువగా యాక్షన్ కూడా కనిపించదు... అలా అని మిగతా క్రికెటర్ లాగా భారీకాయం కూడా లేదు. సంజూ శాంసన్ చూస్తే అచ్చం పక్కింటి కుర్రాడులా లేదా మన కాలేజీ ఫ్రెండ్ గా కనిపిస్తూ ఉంటాడు. ఎంతో స్లిమ్ గా ఉండే సంజూ శాంసన్ అలవోకగా భారీ బౌండరీల బాదేస్తున్నాడు. బౌండరీలనే కాదు కొన్ని కొన్ని బంతులను స్టేడియం దాటిస్తున్నాడు సంజూ శాంసన్.
దీంతో భారత్ క్రికెట్ కి ఫ్యూచర్ సూపర్ స్టార్ సంజు శాంసన్ కాబోతున్నాడు అనే ఎంతోమంది మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీని గురించి మీడియా మాట్లాడిన సంజు శాంసన్... అనుకున్నది సాధించలేక పోవడంతో ఎంతో చిరాకు పడ్డాను.. చివరికి ఆత్మశోధన చేసుకుని నేను దేని కోసం వెతుకుతున్నాను అనేది గ్రహించాను.. ఆ తర్వాత దాని కోసం ఎంతో శ్రమించాను అంటూ సంజు శాంసన్ చెప్పుకొచ్చాడు. సిక్సర్లు బాదే శక్తి గురించి చెప్పాలి అంటే.. అది మా నాన్న నుంచే వచ్చింది అంటూ తెలిపాడు. మా నాన్న చాలా గట్టి మనిషి.. ఆయన నుంచే నాకు ఇంత బలం వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు