ధైర్యానికి, మూర్ఖత్వానికి సన్నని గీత ధోని ఆలోచన..?

praveen
ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య  జరిగిన మ్యాచ్లో ధోనీ కెప్టెన్సీ పై  ఇప్పటికి చర్చ జరుగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. భారీ ఛేదన ఉన్న సమయంలో ధోని ఏడవ స్థానంలో రావడం నాయకుడి లక్షణం కాదు అంటూ ఎంతో మంది మాజీలు  ధోనీ కెప్టెన్సీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. చివర్లో ధోనీ కొట్టిన మూడు సిక్సర్లు కూడా తన రికార్డుల కోసం తప్ప దేనికి ఉపయోగపడవు అంటూ  ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ధోని ఛేదన  లో ముందుగా రాకపోవడమే కాక  దానికి ఇంకా సాకులు కూడా చెబుతున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



 అయితే తాజాగా ధోని కి మద్దతు పలుకుతూ భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోనీ వ్యవహరిస్తున్న తీరు సరిగ్గానే ఉంది అంటూ వ్యాఖ్యానించాడు. ధోని ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే దాని వెనక ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుంది అంటూ తెలిపిన ఆకాష్  చోప్రా... ధోని చెప్పిన కారణం కూడా సరైనదే కదా అంటూ తెలిపాడు. ధోని 14 నెలల నుంచి క్రికెట్కు దూరం గా ఉన్నాడని... ఇక ఐపీఎల్ అకస్మాత్తుగా ప్రారంభం కావడంతో ఎక్కువగా ప్రాక్టీస్ చేసే అవకాశం కూడా ధోని కి రాలేదు అంటూ తెలిపాడు ఆకాష్  చోప్రా. అందుకే బ్యాటింగ్ లో  డిమోషన్ కల్పించుకుని ఏడో స్థానంలో వస్తున్నాడు అంటూ తెలిపాడు.




 అయితే ధోనీ నిర్ణయాలు ఎప్పుడూ అందరికీ షాకింగ్ గానే ఉంటాయి అంటూ తెలిపిన ఆకాష్ చోప్రా... ధోని ఎన్నో క్లిష్ట పరిస్థితులను దాటుకుని ఇక్కడ వరకు వచ్చాడు అంటూ గుర్తు చేశారు. ధైర్యసాహసాలకు మూర్ఖత్వానికి మధ్య ఒక సన్నని గీత మాత్రమే ఉంటుందని... భయం ధైర్యం అనే పదాలను ఎప్పుడో  దాటేసి ధోని ముందుకు వచ్చేశాడు అంటూ ఆకాష్  చోప్రా  వ్యాఖ్యానించాడు. అయితే ఒక్క మ్యాచ్ తోనే  ధోని నిర్ణయాలు తప్పుపట్టడం సరైనది కాదని... అతని నాయకత్వ పటిమ గురించి అందరికీ తెలుసు అంటూ ధోని కి మద్దతుగా నిలిచాడు ఆకాష్  చోప్రా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: