ఈసారి చెన్నై, ముంబై కాదు.. టైటిల్ విజేత ఎవరో చెప్పిన సచిన్..?
కేవలం క్రికెట్ అభిమానులే కాదు క్రికెట్ ప్రముఖులు సైతం ఈ విషయంపై స్పందిస్తూ... ఐపీఎల్ 2020 సీజన్లో టైటిల్ ఎవరు గెలవబోతున్నారో అనే దానిపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే సచిన్ టెండూల్కర్ దీనిపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అతి ఎక్కువ సార్లు టైటిల్ గెలుచుకున్న ముంబై చెన్నై కాకుండా సరికొత్త జట్టు ఈసారి టైటిల్ గెలుస్తుందని జోస్యం చెప్పారు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. ఇక ఈ కొత్త జట్టు ఏదో కాదు ఇప్పటి వరకు కనీసం ఫైనల్ కు చేరుకోని చెత్త రికార్డు కలిగి ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.
ఈసారి కోహ్లీ సారథ్యంలో ఉన్న బెంగళూరు జట్టు ఐపీఎల్ టైటిల్ విజేత గా నిలుస్తుంది అంటూ సచిన్ తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టాడు సచిన్ టెండూల్కర్. ఈసారి బెంగళూరు జట్టు విజయం సాధించడం పక్క.. కావాలంటే ఈ పోస్టు మార్క్ చేసి పెట్టుకోండి అంటూ సవాల్ కూడా విసిరారు. అయితే సచిన్ టెండూల్కర్ సొంత జట్టైనా ముంబై ని కాకుండా బెంగళూరు జట్టు గెలుస్తుంది అని చెప్పడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. దీనిపై కూడా స్పందించిన సచిన్ తనకు సొంత జట్టైనా ముంబై జట్టు ఎంతో ఇష్టమే కానీ ఈ సారి ఎందుకో బెంగళూరు గెలుస్తుందని గట్టిగా నమ్ముతున్నాను అంటూ చెప్పుకొచ్చారు.