వడపావ్ చేస్తున్న సచిన్.. ఇంతలో ఊహించని అతిథి ప్రత్యక్షం.. నెటిజన్ల నవ్వులు..?
అయితే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కి అత్యంత ఇష్టమైన వంటకం వడ పావ్ అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆనందంగా ఉన్న సమయంలో వడ పావ్ లాంటి వంటకాలను వండుకొని తినడానికి సచిన్ టెండూల్కర్ ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. ముంబైలో వడాపావ్ అనేది ఎంతో ఫేమస్ అయినా పాపులర్ ఫాస్ట్ ఫుడ్ అనే విషయం దాదాపుగా అందరికీ తెలుసు. కాగా ఇటీవలే సచిన్ తన ఇంట్లో తన ఫేవరెట్ వంటకం అయినా వడాపావ్ ని తానే స్వయంగా వండుకున్నారు.
ఇక వడాపావ్ వంటకం పూర్తి చేసి ఎంతో హాయిగా ఆరగిద్దాం అనుకుంటున్న సమయంలో.. ఇంట్లో ఒక ఊహించని అతిథి ప్రత్యక్షమైంది. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు సచిన్ టెండూల్కర్. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ పెట్టిన పోస్టు నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. అంతేకాదు తెగ నవ్విస్తుంది. అకస్మాత్తుగా ప్రత్యక్షమైన అతిది ఎవరో తెలుసుకోవాలంటే స్వైప్ చేయండి అంటూ రెండు ఫోటోలను షేర్ చేశాడు సచిన్ టెండూల్కర్. ఆ అతిథి ఎవరో కాదు డోర్ పక్క నుంచి తొంగి చూస్తున్న పిల్లి. దీంతో పిల్లి ఫోటో చూసి నెటిజన్లు అందరూ నవ్వుకుంటున్నారు.