సూపర్ ఓవర్ లో వారికి అస్సలు బౌలింగ్ చేయకూడదు : కుల్దీప్ యాదవ్

praveen

క్రికెట్ ఆటలో సూపర్ ఓవర్  ఎంత ఉత్కంఠగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మ్యాచ్ మొత్తం ఉన్న ఉత్కంఠ ఒక ఎత్తయితే సూపర్ ఓవర్ లో ఉండే ఉత్కంఠ మరింత ఎక్కువగా ఉంటుంది. సూపర్ ఓవర్ లో అప్పటి వరకు పోరాడిన పోరాటానికి ఫలితం తెలుస్తుంది. సూపర్ ఓవర్ లో  అద్భుతమైన ప్రతిభ కనబర్చాలి ఉంటుంది. అయితే ఇరు జట్ల స్కోర్ సమయం అయినప్పుడు సూపర్ ఓవర్ అనే ఆప్షన్ ఉంటుంది అనే విషయం తెలిసిందే. సూపర్ ఓవర్ ద్వారా ఎవరు ఎక్కువ పరుగులు చేస్తే వారికి విజయం వరిస్తుంది. ఈ సూపర్ ఓవర్ అన్నది ఆటగాళ్లకు చాలా క్లిష్టమైనది. సూపర్ ఓవర్లో  ఎంతో ప్రతిభ కనబరిస్తే గాని జట్టుకు విజయాన్ని అందించలేము.

 

 

 అయితే తాజాగా భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సూపర్ ఓవర్  గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.భారత క్రికెట్ జట్టులో మణికట్టు మాయాజాలంతో ఎంతోమంది ప్రత్యర్థి బ్యాట్స్మెన్ లను  బోల్తా కొట్టించిన ఆటగాడు కుల్దీప్ యాదవ్. ఎడమచేతి వాటం స్పిన్నర్ ఆయన కుల్దీప్ యాదవ్ తన మణికట్టు మాయాజాలంతో ఎన్నోసార్లు మ్యాజిక్ సృష్టించాడు అనే చెప్పాలి. తనదైన స్పిన్ మాయాజాలంతో ఎన్నో కీలక వికెట్లు తీసుకున్నాడు. ఇక టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదిగాడు కుల్దీప్ యాదవ్. అయితే తాను బౌలింగ్లో మెలికలు నేర్చుకోవడానికి కారణం ధోని  అని పలుమార్లు తెలిపాడు. 

 

 

 సూపర్ ఓవర్ లో ముగ్గురు బ్యాట్స్మెన్ లకు బౌలింగ్  చేయకూడదు అంటూ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ముగ్గురి పేర్లను బయట పెట్టాడు. వారిలో భారత జట్టు స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ... భారత జట్టులో కీలక ఆటగాడిగా మారిపోతున్న శ్రేయస్ అయ్యర్.. మరో ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ పేర్లను చెప్పాడు కుల్దీప్ యాదవ్. మిగతా ఇద్దరి కంటే సూర్యకుమార్ యాదవ్ తన బౌలింగ్లో బాగా ఆడగలడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ లో తన బౌలింగ్ మరింత మెరుగు పడడానికి ధోని ఇచ్చిన సలహాలే  కారణమంటూ కుల్దీప్ యాదవ్ తెలిపిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: