ప్రతి ఆటగాడి సెకెండ్ డ్రీమ్ అదే.. స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది : కేఎల్ రాహుల్
న్యూజిలాండ్ మౌంట్ మాంగాని వేదికగా జరిగిన అయిదవ టి20 మ్యాచ్ లో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి సంచలన రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. విదేశంలో ద్వైపాక్షిక సిరీస్లో ఆతిధ్య జట్టును ఐదు మ్యాచ్ల్లో ఓడించి క్లీన్ స్వీప్ చేసిన జట్టుగా ఉన్న టీమిండియా రికార్డు సృష్టించింది. అయితే మొదటి నుంచి అద్భుతమైన ప్రదర్శన చేస్తూ వచ్చిన టీమిండియా 5 మ్యాచ్ లోనూ మంచి విజయాన్ని సాధించింది. న్యూజిలాండ్ జట్టు ఒత్తిడిని తట్టుకోలేక టీమిండియాకు విజయాన్ని కట్టబెట్టింది. అయితే టి20 మ్యాచ్ గెలిచి క్లీన్ స్వీప్ చేయడం పై స్పందించిన టీం ఇండియా ఓపెనర్ కె.ఎల్.రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము విజయాలు సాధించడం పైనే దృష్టి పెడతామని... ఇక్కడ జూనియర్లు సీనియర్లు అనే తేడాలు ఉండవు అంటూ తెలిపాడు.
న్యూజిలాండ్తో జరిగిన టి20 సిరీస్ లో 224 పరుగులు చేసి కేఎల్ రాహుల్ మాన్ అఫ్ ది సిరీస్గా నిలిచి సంచలన రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అంతకుముందు టీ20ల్లో ఒక సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కోహ్లీ పేరు మీద ఉండగా ఆ రికార్డును బద్దలు కొట్టాడు. అంతా కలిసికట్టుగా ఆడడంతోనే ఒత్తిడి కూడా ఎదుర్కొని విజయాలు సాధిస్తాము అని తెలిపాడు రాహుల్ . గత మూడేళ్ళ నుంచి టీమ్ ఇండియా జట్టు స్వదేశంలోనూ ఇతర దేశాలలోనూ అద్భుత విజయాలను నమోదు చేస్తోంది అంటూ రాహుల్ చెప్పుకొచ్చాడు. మైదానంలోగాని డ్రెస్సింగ్ రూమ్లో కానీ ఆటగాళ్ల మధ్య సీనియర్లు జూనియర్లు అనే తేడా ఉండదు అంటూ తెలిపారు.
ప్రతి ఒక ఆటగాడు విజయం కోసం మాత్రమే చర్చిస్తామని... సమిష్టి కృషి చేసి విజయాన్ని సాధిస్తుమని తెలిపారు. విదేశాలు 5-0 తేడాతో గెలవడం అంటే చాలా అరుదైన విషయం. అది టీమిండియాకు సాధ్యమైంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే జట్టుకు నేను కూడా కెప్టన్ గా వ్యవహరించాను.. నేను కెప్టెన్ గా వ్యవహరించినప్పటికీ జట్టులోని ఆటగాళ్లు అందరు విజయంలో ఓ భాగమయ్యారు. అయితే దేశం తరఫున క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడం ఒక స్పెషల్ ఫీలింగ్ అంటూ తెలిపాడు కేఎల్ రాహుల్. అయితే ప్రతి ఒక్క ఆటగానికి దేశం తరఫున ఆడటం అనేది మొదటి డ్రీమ్ అయితే దేశానికి సారథ్యం వహించడం అనేది సెకండ్ డ్రీమ్ గా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయం కావడంతో రిటైర్డ్ హార్డ్ గా వెనుతిరిగాడు. ఆ తర్వాత జట్టుకు కె.ఎల్.రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించాడు.