గ్రహణం ఉందని క్రికెట్ మ్యాచ్ ఆపేసారు.?

praveen

సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు చాలామంది పురాతన సంప్రదాయాన్ని పాటిస్తారు అన్న విషయం తెలిసిందే. ఎలాంటి వంటలు వండుకోకుండా.. గ్రహణ సమయంలో ఏమీ తినకుండా ఉంటారు. గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటిని మొత్తం శుద్ధి చేసుకుని స్నానం చేసి వంట చేసి అప్పుడు ఆహారాన్ని తీసుకుంటారు. అయితే ఒకప్పటి ఆచారాన్ని ఇప్పుడు గ్రహణం సమయంలో ఎక్కువ మంది పాటించక పోయినప్పటికీ.. కొంతమంది మాత్రం ఇంకా ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇక సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు అటు దేశంలోని  ఆలయాలన్నీ మూసివేస్తారు. గ్రహణం పూర్తయిన తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 

 

 

 ఇవన్నీ ఓకే కానీ ఇక్కడ గ్రహణ సమయంలో క్రికెట్ మ్యాచ్ ఆగిపోయింది. ఇంతకీ క్రికెట్ మ్యాచ్ గ్రహణానికి సంబంధం ఏమిటి.. క్రికెట్ మ్యాచ్ గ్రహణం  ఉందని మ్యాచ్  ఎందుకు నిలిపి వేసారు అంటారా... అది తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే. ఈరోజు ఏర్పడిన సూర్యగ్రహణం కారణంగా ముంబై రాజ్కోట్లో జరుగుతున్న రంజీ మ్యాచ్ లను గురువారం రెండు గంటల ఆలస్యంగా మొదలుపెట్టారు. దీనికి కారణం గ్రహణం కారణంగా కొన్ని ప్రాంతాల్లో దట్టంగా లేదా పాక్షికంగా చీకటి ఏర్పడే అవకాశం ఉందని నిర్వాహకులు భావించారు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్  రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభించేందుకు నిర్ణయించారు నిర్వాహకులు. ఎందుకంటే మ్యాచ్ జరుగుతున్న సమయంలో సరైన వెలుగు లేకపోతే ఇబ్బందులు ఏర్పడతాయని నిర్వాహకులు తెలుపుతున్నారు. 

 

 

 షెడ్యూల్ ప్రకారం అయితే ఉదయం 9:30 గంటలకు రంజీ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ వాంఖడేలో ముంబై రైల్వే,  రాజ్కోట్లో సౌరాష్ట్ర,  యూపీ మధ్య జరిగే మ్యాచ్ లు ఉదయం 11:30 గంటలకు మొదలు కానున్నాయి. దీనికి కారణం సూర్యగ్రహణం. సూర్య గ్రహణం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు కొనసాగుతుండటంతో సూర్యగ్రహణ సమయంలో చీకటి ఏర్పడి ఛాన్స్ ఉందని భావించి నిర్వాహకులు మ్యాచ్ ను  రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: