ఐపీఎల్లో జీరోలు గా మారిన హీరోలు వాళ్లు వీళ్లే.?

praveen

మామూలుగానే భరత్ లో  ప్రేక్షకులందరికీ క్రికెట్ అంటే ఎనలేని అభిమానం. ఈ దేశంలో కూడా క్రికెట్కు లేని క్రేజ్ ఒక భారత్లో ఉంటుంది. ఇక మన దేశంలో కూడా క్రికెట్కు ఉన్నంత క్రేజ్ ఏ ఆటకు లేదు. క్రికెట్ అంటే ఎంత పిచ్చి అంటే మ్యాచ్  వస్తుందంటే దేన్నైనా వదులుకోనీ మ్యాచ్ చూడటానిక్  ఇష్టపడుతుంటారు చాలామంది. ఇక మామూలు మ్యాచ్ లైతేనే కన్నార్పకుండా చూసే ప్రేక్షకులు
ఎంతో మంది ..ఇక  ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ సందడి డబల్ అయిపోతుంది. అయితే తాజాగా ఆటగాళ్ల వేలం జరిగింది. ఈ వేలంలో  చాలా మంది ఆటగాళ్లు బాగానే రేటు పలికారు ఈ సారి. కొందరు యువ ఆటగాళ్లు కూడా ఊహించనంత రేటు పలికారు. కొందరు ఆటగాళ్లు పట్ల మాత్రం ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. 

 

 ఒకప్పుడు హీరోలుగా స్టార్ ప్లేయర్ గా కొనసాగిన వారు ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో జీరోలు గా మారిపోయారు. కనీస ధరకు ఈ ఆటగాళ్ళని  కొనుగోలు చేయలేదు ఫ్రాంచైజీలు. కాగా ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు కి భారీ ధర లభించింది. ఈ వేలంలో ఒకప్పటి స్టార్ బ్యాట్స్మెన్ యూసుఫ్ పఠాన్ కి ఐపీఎల్ వేలం లో ఈ సారి తీవ్ర నిరాశ ఎదురైంది. అతన్ని  కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. కాగా  ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీకి కూడా ఐపీఎల్ వేలంలో నిరాశే ఎదురైంది. అతని కొనుగోలు చేసేందుకు కూడా ఆసక్తి చూపలేదు ఏ ప్రాంచైజీ. ఇక న్యూజిలాండ్ ఆల్ రౌండర్ కొలిన్  గ్రాండ్ హోమ్ కు ఐపీఎల్లో చుక్కెదురైంది. ఇతన్ని  కొనుగోలు చేసేందుకు కూడా ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. 

 


 ఇక దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ ను ఏ ప్రాంచైజీ తొలి సెషన్ లో  కొనుగోలు చేయనప్పటికీ రెండో సెషన్లో మాత్రం రెండు కోట్లకు సొంతం చేసుకుంది ఆర్సీబీ . న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్.. ఆండ్రూ టై, బెన్ కటింగ్,    కార్లోస్ బ్రాత్వైట్, చటేశ్వర పూజారా మనోజ్ తివారీ, హనుమ విహారి కిఈ  ఏడు  ఐపీఎల్ లో చుక్కెదురైంది.ఈసారి ఐపీఎల్ లో ఫ్రాంచైజీలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపని ఆటగాళ్ళందరూ ఐపీఎల్లో మెరుపులు మెరిపించి  ఉరుములు ఉరిమించిన  వాళ్లే. కానీ గత కొంతకాలంగా ఫామ్  కోల్పోయి ఇబ్బందులు పడుతూ ఆటలో పేలవ  ప్రదర్శన చేస్తూ ఉండడంతో వారిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. దీంతో ఒకప్పుడు హీరోలు గా ఉన్న ఆటగాళ్లందరూ ఇప్పుడు హీరోలు గా మారిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: