ఈ "ఘన చరిత్ర"... "ధోనీ" ఒక్కడికే సొంతం..."సాధ్యం"

Bhavannarayana Nch

భారత క్రికెట్ ఉన్నంతవరకూ  కూడా ధోనీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది..ఒకానొక దశలో టీం ఇండియా జట్టు పతనావస్తకి వెళ్ళిపోయినప్పుడు ధోనీ కెప్టెన్ గా చేసిన ఎంట్రీ తో టీం ఇండియా గతి మారిపోయింది..కెప్టెన్ గా టీం ఇండియా ని నడిపించిన ధోనీ తిరుగులేని కెప్టెన్ గా రికార్దులు సృష్టించాడు...ధోనీ హయాంలో భారత జట్టు అత్యున్నత శిఖరాలని అధిరోహించింది..వన్డే ప్రపంచ కప్ ..చాంపియన్స్ ట్రోఫీ...టీ-20 ప్రపంచ కప్ ని అందించి ధోనీ చరిత్రలో మిగిలిపోయాడు..మూడు ఫార్మేట్స్ లో 50 కి పైగా మ్యాచ్ లలో జట్టుకి నాయకత్వం వహించిన ఏకైక కెప్టెన్ ధోనీ మాత్రమే..కెప్టెన్సీ భాద్యతల నుంచీ తప్పుకున్న తరువాత ధోనీ ఆటగాడిగా వికెట్ కీపర్ గా జట్టుకు సేవలు అందిస్తూ వచ్చాడు..

 

ధోనీ అత్యధికంగా టెస్ట్ మ్యాచ్ లలో 331 మ్యాచ్ లు కెప్టెన్ గా చేశాడు..అంతేకాదు వన్డేలు ,టీ-20 మ్యాచ్ లు రెండూ కలిపి 331 మ్యాచ్ లకి కెప్టెన్ గా రికార్డ్ క్రియేట్ చేసిన మొదటి వ్యక్తిగా ధోనీ రికార్ సృష్టించాడు..ఒక వికెట్ కీపర్ గా జట్టులో చోటు దక్కించుకున్న ధోనీ రాహుల్ నుంచీ 2007 లో కెప్టెన్ గా భాద్యతలు స్వీకరించాడు...తోలి సారిగా ఆడిన టీ -20 ప్రపంచ కప్ కి సారధ్యం వహించాడు..ధోనీ సారధ్యం లోనే 2009 లో ఐసీసీ ర్యాంక్స్ లో టెస్టులో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.

 

ధోనీ నాయకత్వంలో 199 వన్డేలు ఆడితే దాదాపు 110 మ్యాచ్ లలో విజయం సాధించింది టీం ఇండియా  72 టీ-20 లలో 41 మ్యాచ్ లలో విజయం సాధించింది..తన కెరియర్ లోనే 283 వన్డేలు ఆడిన ధోనీ 9110 పరుగులు చేశాడు..వాటిలో 9 సెంచరీలు 61 హాఫ్ సెంచరీలు నమోదు చేసాద్.. 72 టీ-20 లు ఆడిన ధోని 1112 పరుగులు చేశాడు..ఇలా ఎన్నో ఎన్నో విజయాలు జట్టుకు అందించిన ధోనీ ఐసీసి వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా అవార్డుని కూడా రెండు సార్లు గెలుచుకున్నాడు..2007 లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డు మరియు 2009 లో పద్మ శ్రీ..2018 లో పద్మ విభూషణ్ పురస్కారాలతో ప్రభుత్వం సత్కరించింది..అంతేకాదు లెఫ్ట్నెంట్ కల్నల్ హోదాలో భారత ఆర్మీ ధోనీ ని సత్కరించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: