ఎంతమందితో వర్క్ చేసిన త్రివిక్రమ్ ఫేవరెట్ బ్యూటీ మాత్రం ఆమె.. ఇప్పటికి ఎప్పటికి..సో స్పెషల్..!

frame ఎంతమందితో వర్క్ చేసిన త్రివిక్రమ్ ఫేవరెట్ బ్యూటీ మాత్రం ఆమె.. ఇప్పటికి ఎప్పటికి..సో స్పెషల్..!

Thota Jaya Madhuri
త్రివిక్రమ్ శ్రీనివాసరావు.. ఇండస్ట్రీలో ఈ పేరుకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ..ఎలాంటి క్రేజ్ ఉంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అఫ్కోర్స్ సినిమా ఇండస్ట్రీలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కన్నా పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు . ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన డైరెక్టర్లు ఉన్నారు . ఒక్కొక్క సినిమాకి కోట్లు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్లు ఉన్నారు.  అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పేరు చెప్తే వచ్చే అరుపులు ఆ మజా మిగతా ఏ డైరెక్టర్ పేరు చెప్పిన రానే రాదు . అలాంటి ఒక స్పెషల్ టాలెంటెడ్ గల డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసరావు.



 ఆయన రాసే డైలాగ్స్ ఎంత ఆహ్లాదకరంగా ఎంత నాచురల్ గా ఉంటాయో అందరికీ తెలిసిందే.  ప్రతి ఒక్క డైలాగ్ ని కూడా నిజజీవితంలో జనాలు ఫేస్ చేసిన సిచువేషన్ ఆధారంగానే రాస్తూ ఉంటారు . ఆయన తెరకెక్కించే సినిమాలు కూడా చాలా బాగుంటాయి . అందుకే పెద్ద పెద్ద హీరోలు కూడా త్రివిక్రమ్ తో సినిమా ఛాన్స్ వస్తే మిస్ చేసుకోరు.  ప్రజెంట్ ఇప్పుడు అల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్ తో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే త్రివిక్రమ్ గురించి కొన్ని కొన్ని వార్తలు ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటాయి.



మరి ముఖ్యంగా ఆయన తన సినిమాలో చూస్ చేసుకునే హీరోయిన్స్ చాలా బాగుంటారని .. ఆ క్యారెక్టర్ కి తగ్గట్టు చేసుకుంటారు అని ఎప్పటినుంచో జనాలు మాట్లాడుకుంటూ వస్తున్నారు.  కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు చాలామంది హీరోయిన్ లతో వర్క్ చేశారు . ఇలియానా - సమంత  - సంయుక్త మీనన్- పార్వతీ మెల్టన్ - మీనాక్షి చౌదరి - శ్రీ లీల - త్రిష ఇలా చాలామంది హీరోయిన్స్ తో అయినా వర్క్ చేశారు.  కానీ వీళ్ళందరిలోకి ఆయన ఫేవరెట్ బ్యూటీ మాత్రం ఇలియానానే అంటూ చాలా సందర్భాలలో జనాలు మాట్లాడుకున్నారు . ఆయనకు తెలిసో తెలియకో పలు ఈవెంట్స్ లో ఇలియానా గురించి ప్రస్తావించి ఆమెపై ఉన్న అభిమానాన్ని పరోక్షకంగా బయట పెట్టేశాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో ఇలియానా నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి . వీళ్ళకు కాంబో ఎప్పుడు స్పెషల్ . మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోగా ఇలియానా హీరోయిన్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వం లో తెరకెక్కిన "జల్సా" మూవీ ఇప్పటికీ ఒక సెన్సేషన్ గానే మిగిలిపోయింది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: