కొంతమంది ఎంత పని చేసినా ఎంత డబ్బు సంపాదించినా ఏదో ఒక లోటు వారి ఇళ్లలో వాటిల్లుతు ఉంటుంది.అలాంటివారు పదే పదే వారి మనసును నొప్పించుకుంటూ,ఎప్పుడు అనారోగ్యంతో,గొడవలతో, పిల్లల్లో ఎదుగుదల లేకపోవడం వంటి వాటితో వారి కుటుంబమే చిందరవందరగా తయారవుతూ ఉంటుంది.దానికి కారణం వారి శత్రువుల యొక్క ఏడుపులు వారికి తగలడమే.కొంతమంది మనుషులు ఎదిగే వారిని చూసి ఏడుస్తూ ఉంటారు.కానీ అలాంటి ఏడుపులు ఏమి చేయవు.కానీ అవి కూడా ఒక్కొక్కసారి దృష్టి తగిలినట్టై,ఎదిగే వారు కూడా,ఏదో ఒక సమస్యతో ఆగిపోతూ ఉంటారు.చెడు చేయాలనుకునే వారు,వారు ఎదుకగపోగా,వేరేవారిని చూసి ఏదొక మాటలో అనడమో,లేదా వారి గురించి నెగటివ్ గా చెప్పడము వంటివి చేస్తూ ఉండడంతో,మంచిగా ఉన్న వారింట్లో కూడా తగాదాలు కూడా వస్తూ ఉంటాయి.మరియు వారు అనుకున్న పనులు వేగవంతంగా జరగకుండా, వాయిదా పడుతుంటాయి.ఇలా కాకుండా మంచి వారి కుటుంబానికి ఎటువంటి శత్రుపీడ తగలకుండా ఉండాలంటే,కొన్ని రకాల నివారణను పాటిస్తే చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారు అయితే ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి..
దీనికోసం ముందుగా 11 గురువింద గింజలను,గుప్పెడు ఆవాలను పక్కన పెట్టుకోవాలి.ఈ రెమిడి మంగళవారం కానీ,శనివారం కానీ చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది.
ఇప్పుడు కుటుంబం అంతా ఒకచోట నిలబడి ఉంటే కుటుంబ పెద్ద గురువింజ గింజలను ఒకసారి,ఆవాలతో ఒకసారి వారి చుట్టూ 11 సార్లు దిష్టి తీసి వాటిని దక్షిణ దిక్కు వైపు వెళ్లి, మూడు రోడ్లు కలిసే చోట గురువింద గింజలను పూడ్చాలి.ఆ తరువాత ఆవాలను మండించి, అలా వచ్చిన బూడిదను,అక్కడే కాలితే తొక్కి వెనుకకు తిరగకుండా రావాలి.
ఇలా చేయడం వల్ల ఆవాల బూడిద అయినట్టు మీ మీద ఎటువంటి చెడు దృష్టి ఉన్నా కూడా బూడిద అయిపోతాయి.ఇలాంటి సమస్యను ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటూ ఉంటారు.అ సమయంలో ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది.దీనితో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కుదిరి,ఆర్థికంగా కూడా ఎదుగుతారు.