కార్తీక మాసంలో చన్నీటి స్నానంతో కలిగే లాభనష్టాలెంటో తెలుసా..?

frame కార్తీక మాసంలో చన్నీటి స్నానంతో కలిగే లాభనష్టాలెంటో తెలుసా..?

Divya
కార్తీకమాసంలో చాలామంది కార్తీకస్నానం ఆచరిస్తూ వుంటారు.ఈ నెలలో అసలే చలి ఎక్కువగా ఉంటుంది.కొంతమంది వేడి నీటితో స్నానం చేయడానికి ఇష్టపడితే,ఇంకొందరు చల్లనీటి స్నానం చేయడానికి ఇష్టపడతారు.కానీ చల్లని నీటితో స్నానంతోనే అధిక లాభాలు కలుగుతాయని చాలా మందికి తెలీదు కూడా. ఇలా రోజూ చల్లనీళ్ల స్నానం చేయడం వల్ల దీర్ఘకాలికంగా లాభం పాటు బరువు కూడా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.అంతే కాక ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయని కూడా చెబుతున్నారు.మరీ అవేంటో మనము తెలుసుకుందాం పదండీ..
శరీరంపై పడే చల్లని నీటితో శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.ఇలా స్నానం చెయ్యడంతో ధమనులు బలంగా ఉంటాయి.అంతేకాక రక్తపోటు తగ్గి కొత్త ఉత్సాహం నెలకొంటుంది.డిప్రెషన్ వల్ల బాధపడే వారు రోజు చల్ల నీళ్ల స్నానం చేయడంతోడిప్రెషన్‌ లక్షణాలు,తగ్గుతాయి.మరియు వాపు,కండరాల నొప్పుల వంటి సమస్యలు తగ్గిపోతాయని వైద్యులు సూచిస్తున్నారు.
చన్నీటి స్నానం జుట్టుకు చాలా బలాన్ని చేకురుస్తుంది.పొల్యూషన్ వల్ల కేశరంధ్రాలు ధూళితో నిండి మూసుకుపోకుండా చన్నీళ్లు సహాయపడుతాయి. అంతేకాకుండా చన్నీటి స్నానంతో జీవక్రియ రేటు పెరుగుతుంది.దానితో శరీరం యాక్టీవ్ స్టేజ్ లో ఉండి బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.
కానీ చలికాలంలో రోజూ చన్నీటితో స్నానం చేస్తే కొంతమందికి అనేక ఆనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు వైద్య నిపుణులు.ఆస్తమా పెషేంట్లకు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.ఇంకొంతమందిలో బ్రెయిన్‌ స్ట్రోక్‌,గుండెపోటుకు గురికావచ్చని చెబుతున్నారు. ఇంకా మధుమేహం,గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక రోగాలు ఉన్న,వయసు మళ్ళినవారు చన్నీటి స్నానానికి దూరంగా ఉండటం చాలా మంచిది.
ఇలా రోజూ చన్నీటి స్నానం ఆచరించడంతో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి దగ్గు,జలుబు, న్యుమోనియా,జ్వరం,గొంతులో చిరాకు వంటి సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఈ కాలం అనే కాదు ఏ కాలంలో అయినా గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు.మరీ ముఖ్యంగా చలికాలంలో తలస్నానం చేసేప్పుడు ముందు తలపై నీళ్లు పోయడదు.ఇలా చేస్తే హార్ట్ స్ట్రోక్స్‌ వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుందని చెబుతున్నారు.రోజు వారి చర్యలో భాగంగా వ్యాయామం చేయడంతో శరీరం వెచ్చగా ఉంటూ చురుకుగానూ ఉంటారని చెబుతున్నారు.కావున కార్తీక మాసంలో చన్నీటి స్నానం ఆచరించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: