హిందువులు గర్వించే సంస్థ.. గీతా ప్రెస్‌?

frame హిందువులు గర్వించే సంస్థ.. గీతా ప్రెస్‌?

హిందూ మత ఉద్ధరణ కోసం గీతా ప్రెస్ చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల గాంధీ శాంతి బహుమతిని ప్రకటించింది. అయితే ఈ బహుమతిలో భాగంగా గీత ప్రెస్ వాళ్లకి ఒక కోటి రూపాయలు సొమ్మును కూడా అందిస్తారు. అయితే ఇప్పుడు గీత ప్రెస్ వాళ్లు  ఆ కోటి రూపాయలు మాకు అవసరం లేదు ఆ పురస్కారం ఒకటే  మాకు చాలు అని అంటున్నారట. అయితే దీనిపై కాంగ్రెస్ విమర్శిస్తూ ఉంటే, బిజెపి సమర్థిస్తున్నట్లుగా తెలుస్తుంది.


అసలు ఈ గీత ప్రెస్ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది. గీత ప్రెస్ వాళ్లు ఆ ప్రెస్ పెట్టక ముందటి రోజుల్లో తమ సొంత మగ్గాల మీద ఖాదీ వస్త్రాలు నేసి అమ్మడం మొదలు పెట్టారట. జయ దయాళ్ గోయంక, ఘన శ్యామ్ దాస్ జలన్ లు తమ కళ్ళ ఎదురుగానే మిషనరీ సంఘాలు బైబిల్స్ పంపిణీ చేయడం చూసి తమలో తాము మదనపడ్డారు. హిందూ మతం గురించి ప్రచారం చేస్తే కొంతవరకు మంచిదని వాళ్లు భావించారు.


దానికోసం వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చించి, హిందూ సంఘ నిర్మాణ మండలి వాళ్ళతో, ఇంకా గోరఖ్ పూర్ మఠం వాళ్ళతో మాట్లాడి 1923లో గీత ప్రెస్ ను స్థాపించారు. అప్పట్లోనే సోత్తార్ మహాశయులు 500ఎకరాల భూమిని ఈ గీతా ప్రెస్ కు విరాళంగా ఇచ్చారు. ఆ వ్యవసాయ ఆధారిత ధనంతో గీతా ప్రెస్ నడిచేది. ఆ తర్వాత బయట నుండి విరాళాలు తీసుకోవడం మానేశారు.


ఇక వాళ్లు తమ సొంత ధనంతోనే పబ్లిష్ చేయాలి, ప్రచారం చేయాలి అని నియమించుకున్నారు. ‌వాళ్ళ పుస్తకాలు రెండు రూపాయలు ధరతో అది కూడా మంచి నాణ్యతతో లభ్యమవుతాయి. దేశంలోని వివిధ స్థానిక భాషల్లో ప్రచురణలు చేయడం కోసం ఆయా భాషల్లోని ప్రముఖుల సహాయాన్ని వీళ్ళు తీసుకున్నారు. మధ్యలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినప్పుడు  కుటుంబ ఆస్తులు అమ్మి మరీ  హిందూ ధర్మ సేవను కొనసాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: