ఇంట్లో రాగి చెట్టు పెరగడం దేనికి సంకేతం..?

Divya
సాధారణంగా హిందూ సాంప్రదాయంలో చెట్లను పూజించడం కూడా ఒక భాగమే.అందులో ముఖ్యంగా రావిచెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది.ఇది ఆధ్యాత్మికంగానే కాక పర్యావరణానికి కూడా చాలా ముఖ్యమైనది.ఈ మొక్క ప్రస్తావన కృష్ణుడు చెప్పిన భగవత్ గీత లో కూడా ఉందని వేదపండితులు చెబుతుంటారు.ఇటువంటి మొక్క ఒక్కొక్కసారి మన దరిదాపుల్లో కానీ,ఇంటి పై కప్పు పై కానీ మోలుస్తూ ఉంటుంది.అంతటి పవిత్రమైన మొక్కను పీకేయలేక ఇబ్బంది పడుతుంటారు.అస్సలు ఈ మొక్క మొలవడం అనేది కొన్ని రకాల చెడు సాంకేతాలను ఇస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
పురాణాల ప్రకారం రావిచెట్టు మిగతా అన్ని చెట్ల కంటే చాలా పవిత్రమైనదిగా పూజింపబడుతుంది.కానీ అది మన ఇంట్లో కానీ,ఇంటి ఆవరణలో కానీ పెరగడం వల్ల మన ఇంట్లో ఏదో చెడు జరగబోతుంది అని అర్థమట. రావిచెట్టు నీడ కూడా ఇంట్లో పడకూడదు.ఇలా పడడం వల్ల,అ ఇంట్లో ఉన్నవారికి ఆర్థిక సమస్యలు,ఏ పని తలపెట్టిన జరగకపోవడం,అభివృద్ధి కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
కావున ఈ రావి చెట్టు ఇంట్లో వచ్చినప్పుడు అసమస్యలు తొలగాలంటే ఆదివారం ఉదయాన్నే ఇంట్లో పెరిగిన రావిచెట్టును పూజించి వేళ్ళతో సహా నరికాలి. ఇలా చేయడంతో ఎవరికీ ఎటువంటి పాపం రాదు.
రావిచెట్టు ఇంటికి దూరంగా ఉన్నప్పుడే శుభఫలితాలను ఇస్తుందని వాస్తుశాస్త్రం చెబుతోంది.ఒకవేళ ఇంట్లో ఎక్కడైనా పెరిగినట్లయితే దానిని అడుగు వరకు పెరగనిచ్చి,అ తరువాత దాన్ని వేర్లతో పాటు తీసి , మరొక ప్రదేశంలో నాటాలి.ఇలా చేయడం వల్ల, దాన్ని తొలగించిన పాపం నుంచి మీరు కూడా రక్షింపబడతారు. లేకుంటే సమీపంలోని ఆలయానికి దానం చేయండి.
కానీ ఇంటి తూర్పు దిశలో రావిచెట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ నాటకూడదు.అలా నాటితే ఇంట్లో దుఃఖం,దారిద్ర్యం తాండవిస్తాయి.ఒకవేళ అ చెట్టు
మళ్లీ మళ్లీ పెరిగినట్టయితే,45 రోజుల పాటు సంపూర్ణ భక్తితో రావిచెట్టును పూజించి,ప్రతిరోజూ దానిపై పచ్చి పాలతో అభిషేకించి,అ కాలం పూర్తయిన తర్వాత,మీరు ఆ రావిచెట్టును దాని వేరుతో సహా పెకిలించి,వేరే ప్రదేశంలో నాటాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: