వాస్తు దోషాలను కర్పూరంతో ఇలా నివారించండి..!

Divya
ఇల్లు కట్టడం అనేది ప్రతి ఒకరికి అపురూపమైన కల. తనకంటూ ఒక ఇల్లు నిర్మించుకొని,పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంటారు.అలాంటి ఇల్లు కట్టేటప్పుడు కచ్చితంగా వాస్తుశాస్త్రం ప్రకారం కడతారు.కానీ కొంతమంది అవగాహన లోపంతో, కొన్ని తప్పులు చేయడం వల్ల,వాస్తుదోషాలు వస్తాయి. దానివల్ల వారి ఇంట్లో సమయానికి డబ్బులు అందక,ధన బాధలు,ఆరోగ్య సమస్యలు,అశాంతి వంటివి కలిగి చాలా ఇబ్బంది పడుతూంటారు.అలాంటివారు వాస్తు దోషాలను పోగొట్టుకోవడానికి కర్పూరంతో కొన్ని నివారణలు చేసుకోవడం వల్ల,వారి సమస్యలకు ఉపశమనం కలుగుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.అలాంటి నివారణలేంటో ఇప్పుడు తెలుసుకుందామా..
ఇంటికి గదులు,వరండా,మేడ తో పాటు చుట్టూ పక్కల స్థలం కూడా వాస్తు ప్రకారం ఉంటేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది.అయితే ఒక్కొక్కసారి వాస్తు దోషాలు కలుగుతుంటాయి.కానీ గదులను మార్చలేము కదా.కానీ వాటిని సరి చేసుకోవడానికి కొన్ని నివారణలను పాటించవచ్చు.ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు,అశాంతితో బాధపడేవారు కర్పూరంతో చేసుకునే నివారణ వల్ల మంచి జరుగుతుంది.
ధన సమస్యలను తొలగించుకోవాలంటే,మంగళవారం పూట ఒక గిన్నెలో 9 లవంగాలు తీసుకొని,అందులో రెండు కర్పూర బిళ్ళలు ఉంచి పూజచేసే సమయంలో దేవుడి ముందు ఉంచాలి.అ తర్వాత వంటగదికి బయట మన కోర్కెను మనసులో అనుకోని,కర్పూరంతో వాటిని కాల్చి బూడిద చేయాలి.ఇలా 9 మంగళవారాల పాటు చేయడంతో ఎటువంటి ఆర్థిక సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి.
అధిక అప్పులతో ఇబ్బందిపడేవారు,శనివారం తలస్నానం చేసేటప్పుడు,స్నానం చేసే నీటిలో నాలుగు కర్పూరం బిళ్ళలు వేసుకొని స్నానం చేయడంతో, పాజిటివ్ ఎనర్జీ కలిగి,తగిన ఉపాయాలు దొరికి, క్రమంగా అప్పుల బాధలు తగ్గుతాయి.
ఎవరికైనా ఇచ్చిన డబ్బు సకాలంలో ఇవ్వకుండా పీడీస్తుంటే,అలాంటప్పుడు శుక్రవారం పూట,ఇళ్ళు వాకిలి శుభ్రం చేసుకొని,పూజగదిలో పసుపుతో అలికి, బియ్యం పిండితో ముగ్గు వేసి,లక్ష్మిదేవిని పూజించాలి. అ తర్వాత ఒక గిన్నెలో నాలుగు కర్పూరం బిళ్ళలు,మూడు లవంగాలు,9 ఎర్రటి పూలను ఉంచాలి.దీనితో ఎటువంటి వాస్తుదోషలైనా తొలగి,సకాలంలో చేతికి అందాల్సిన డబ్బు,చేతికి వస్తుంది.ఎవరికైనా ఇలాంటి బాధలు ఉంటే కచ్చితంగా కర్పూరంతో ఇలా నివారించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: