ఎంత కష్టపడ్డా సమస్యలు తీరడం లేదా..అయితే ఈ వ్రతం చేసి చుడండి..!

Divya
మన హిందూ సంప్రదాయం ప్రకారం భగవంతుణ్ణి ప్రార్తించడం, మన కష్టాలనుండి గట్టు ఎక్కించమని కోరుకోవడం సహజం. కానీ కొంతమంది ఎంత శ్రమించినా అనుకున్న పనులు జరగక, అనుకున్న సంపదలు రాక,అప్పులు పాలవుతుంటారు.అలాంటి వారు కొన్నిరకాల పూజలు చేయడం ద్వారా వారి కష్టాలు తొలగి, రుణవిముక్తి పొందుతారని పండితులు సూచిస్తున్నారు. అందులో భాగంగా, కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వరస్వామిని పూజించడం వల్ల కష్టాలు తొలగించుకోవచ్చని కొన్ని రకాల వ్రతాలను సూచించారు. అదే వెంకటేశ్వరస్వామి వ్రతం. ఇది అందరికి తెలిసిన సరైనా పూజవిధానం తెలియక చేసుకోలేకపోతుంటారు. కనుక ఎలా ఈ వ్రతం ఆచరించాలో ఇప్పుడు చూద్దాం..
పూజా విధానం..
ఈ పూజా విధానం భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేస్తే మరీ మంచిది. ఈ పూజను ఏడు శనివారాలపాటు చేయవలసి ఉంటుంది.శనివారం రోజు ఇల్లంతా శుభ్రపరచుకొని, వాకిట ముగ్గు వేయాలి.తర్వాత తలస్నానం చేసి, పూజావిధానంను మొదలుపెట్టాలి. పూజామందిరాన్ని శుభ్రం చేసి, అందులో ఒక పీట వేసి, దానిపై ఒక గుడ్డముక్కతో కప్పాలి. దానిపై పసుపు, కుంకుమ వేసి, వెంకటేశ్వరస్వామి ఫోటోను పెట్టి, పూలతో అలంకరించుకోవాలి.ఆ తరవాత పీట ముందు కుబేరముగ్గు వేసి పసుపు, కుంకుమ వేయాలి.ఇప్పుడు  ఒక గ్లాస్ బియ్యపుపిండి తీసుకొని, అందులోకి పచ్చ కర్పూరం, బెల్లం వేసి చలిమిడి దీపాలు చేసి, అందులో మూడు రకాల నూనెలతో ఏడు దీపాలను వెలిగించుకోవాలి.

స్వామికి ప్రసాదంగా నువ్వులపిండి, పండ్లు,పాయసం వంటివి పెట్టవచ్చు. మరియు ఒక బట్టలో ఏడు రూపాయలు వేసి ముడుపు కట్టాలి.పూజలో ముందుగా శుక్లం భరదారంతో మొదలుపెట్టి, షోడాపోచార పూజ మంత్రాన్ని జపిస్తూ, స్వామి అంగంగానికి పూజ నిర్వహించుకోవాలి.ఆ తర్వాత వెంకటేశ్వరస్వామి వ్రత కథను చదువుకోవాలి. ఇలా 7వారాల పాటు చేసి,7 వ వారం మూత్తయదువులను పిలిచి,భోజనాలు పెట్టి, వాయనాలు ఇవ్వాలి. ఈ పూజలో భాగంగా కట్టిన ముడుపును తిరుపతి హుండీలో వేయాలి.దీనితో ఆ వెంకటేశ్వరస్వామి అనుగ్రహం కలిగి,అనుకున్న పనులు జరిగి, అప్పులు తిరుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: