
ఫైనల్ టీ 20 : పృథ్వి షా కు ఈరోజైనా చోటు దక్కేనా ?
కానీ ఇండియాను ఆ మాత్రం స్కోర్ ను కూడా చేయకుండా ఇబ్బంది పెట్టిన కివీస్ నైతికంగా గెలిచింది అని చెప్పాలి. కాగా ఈ రోజు అహమ్మదాబాద్ వేదికగా మూడవ మరియు కీలక మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్ లలో కుర్రాడు ఇషాన్ కిషన్ పెద్దగా చేసింది ఏమీ లేదు.. ఇక శుబ్మాన్ గిల్ సైతం ఫెయిల్ అయ్యాడు, వచ్చిన సువర్ణావకాశాన్ని ఉపయోగించుకోవడంలో సన్ రైజర్స్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి విఫలం అవుతున్నాడు. దీనితో చివరి మ్యాచ్ కు జితేష్ శర్మ మరియు పృద్వి షా లకు అవకాశం ఇచ్చి చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. సిరీస్ కోసం జరిగే మ్యాచ్ కదా.. ఈ సమయంలో ప్రయోగాలు అవసరమా అని కూడా సందేహం రావొచ్చు.. కానీ పృథ్వి షా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఆడిన అనుభవం ఉంది.
ఒక్క ఛాన్స్ ఇస్తే జట్టులో ఉన్నందుకు కాస్త సంతృప్తి ఉంటుంది. ఇక నెక్స్ట్ సిరీస్ లలో రోహిత్ మరియు కోహ్లీ లు వస్తే వీరికి చోటు దక్కడం కష్టమే. అందుకే ఈ మ్యాచ్ లో కుదరితే ఇద్దరికీ లేదంటే పృథ్వి షా కు అయినా ఆడే ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని ఎక్కువ మంది అభిమానుల అభిప్రాయం. మరి టీం కోచ్ మరియు కెప్టెన్ ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది తెలియాలంటే టాస్ వరకు ఆగాల్సిందే.