కుక్కకు ఇది పెడితే కష్టాలన్నీ మాయం.. ఏంటది..!

MOHAN BABU
మానవ జీవితంలో కష్ట, సుఖాలు అనేవి వస్తూ పోతూ ఉంటాయి. సుఖం వచ్చినప్పుడు ఆనంద పడతాం. కష్టం వచ్చినప్పుడు దాన్ని పోగొట్టుకునే పరిహారం కోసం వెతుకుతాం. మరి ఆ సమస్యను పోగొట్టే పరిష్కార మార్గాలు ఏంటో తెలుసుకుందాం..? మీ జీవితంలో మీకు ఎప్పుడైనా సరే ఊహించనటువంటి ఆపద వస్తే మాత్రం వెంటనే కుక్కకు బ్రెడ్ వేయండి. ఆ బ్రెడ్ కు కొద్దిగా నువ్వుల నూనె రాసి దానికి తినిపించండి. దీని ద్వారా వెంటనే మీ సమస్య క్లియర్  అవుతుంది. అలాగే అనుకోకుండా సమస్యలు వచ్చినట్లయితే మంగళవారం రోజున నానబెట్టిన ఉలువలు ఆవులకు తినిపించండి. అప్పుడు ఆ సమస్యకు చక్కటి పరిష్కార మార్గం మీకు లభిస్తుంది.

అలాగే ఊహించని సమస్యలు వచ్చినప్పుడు అది ఏ సమస్య అయినా కానీ డబ్బు పరంగా, సంతాన పరంగా, అప్పుల వల్ల గాని, ఆరోగ్యపరంగా గాని ఎప్పుడైనా సరే మీరు అనుకోకుండా ఊహించని సమస్య వస్తే వెంటనే దాని నుండి బయట పడాలంటే మీ ఇంట్లో ఉన్న గణపతి విగ్రహాన్ని గానీ, గణపతి ఫోటోకు గాని సింధూరంతో బొట్లు పెట్టాలి. దీంతోపాటు గరిక, ఎర్ర పుష్పాలు పెట్టి నమస్కరిస్తే అనుకోకుండా వచ్చే సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే మీకు ఊహించని సమస్య మీ వెంట ఉంటే ఓం రామ్ రామ్ రామ్ రామ్ సమస్య స్వాహా అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఎంతటి భయంకర సమస్య అయినా ఇట్టే తొలగిపోతుంది. అలాగే సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సమస్య నుండి తొందరగా బయటపడడానికి రావి చెట్టు దగ్గరికి వెళ్లి శ్రీరామ జయ రామ జయజయ రామ రావి చెట్టు కింద నిల్చొని 11సార్లు చెప్పుకొని వెళ్ళండి. అలా చేస్తే కూడా మీ సమస్యకు చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది.

 అలాగే రోజు పని మీద బయటకు వెళ్ళినప్పుడు గుమ్మం దాటి బయటకు వెళ్ళటంతోనే నారాయణ నారాయణ నారాయణ అంటూ నామం జపిస్తే చాలా వరకు సమస్యలు దూరమవుతాయని మనకు పరిహార శాస్త్రం చెబుతోంది. అలాగే ఎప్పుడైనా సరే మీకు సమస్యలు బాగా ఎక్కువ అయినప్పుడు నీ దగ్గర లో ఎక్కడైనా ఆవు పేడ కనిపిస్తే ఆ పేటలో నిమ్మకాయ పెట్టి దానిపై కొద్దిగా సిందూరం చల్లి ఇది మీ సమస్యను చెప్పుకుంటే మీ సమస్య పోతుంది అలాగే మీరు అనుకున్న పని ఎలాంటి ఆటంకాలు లేకుండా సులభంగా అయిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: