అప్పుల బాధలు పోగొట్టే ఏకైక మార్గం.. ఎలా అంటే..!

MOHAN BABU
 పితృ దోషాలు నాగ దోషాలు ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు పోగొట్టే పరిష్కార మార్గాలు అనేకం ఉన్నాయి. ఇందులో చాలా మందికి నాగ సున్ని దోషమనేది ఉంటుంది. ఈ నాగసున్ని దోషాన్ని పోగొట్టుకుంటే మనం అప్పుల బాధనుండి, నాగ దోషాలు నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. దీన్ని ఎలా పాటించాలో తెలుసుకుందాం..! ఆకుపచ్చని పెసల నుంచి తయారైన సున్నిపిండిని అర కిలో తీసుకోవాలి. తర్వాత 50 తమలపాకుల కాడలతో ఉన్నవి  తీసుకొని, ఈ పిండితో పాటు రెండు మిక్సీలో వేయండి. దానికి సరిపడా నీళ్ళు పోస్తే పేస్టులాగా వస్తుంది. ఆ పేస్ట్ ను తీసుకొని ఎండలో ఆరబెట్టి, అది పూర్తిగా ఎండిన తరువాత జల్లెడ పట్టి అప్పుడు మీకు పొడి వస్తుంది. దీన్నే నాగ సున్ని పొడి అంటారు.

దీనికి నాగ సున్ని పొడి ఎందుకు వచ్చిందంటే  నాగవల్లి ఆకులతో కలుపుతాం కాబట్టి ఆ పేరు వచ్చింది. ఈ పొడిని ఉపయోగించి ప్రతి సోమవారం ఉదయం 7.30-9 గంటల మధ్య ప్రాంతంలో  ఒక ప్రత్యేకమైన పరిహారాన్ని పాటిస్తే మనం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ నాగ సున్ని పొడిని తీసుకుని అందులో కొద్దిగా మజ్జిగ కలిపి, అలా కలిపిన దానిని మీ కంఠం నుంచి హృదయం వరకు రాసుకోండి. లేదా నాగ సున్ని పొడిలో పెరుగు కొద్దిగా కలిపి చేసినా పర్లేదు. అలా రాసుకున్న తర్వాత మీరు ఒక 15 నిమిషాలు ఆగి స్నానమాచరించండి. అలాగే తొమ్మిది నల్ల మిరియాల పరిహారం పాటించడం వల్ల కూడా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడవచ్చు. మీ వృధా ఖర్చులు కూడా తొలగిపోతాయి. ఈ మిరియాల పరిహారాన్ని అమావాస్య రోజు పాటించాలని రహస్య తాంత్రిక గ్రంధాలలో చెప్పారు. అమావాస్య రోజున తొమ్మిది నల్లమిరియాలు తీసుకొని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటకట్టి మీ ఇంటి

 గుమ్మం బయట కుడివైపు మేకు ఉంటే దానికి ఈ మూటను కట్టండి. దీన్ని మళ్ళీ వచ్చే అమావాస్య వరకూ అలాగే ఉంచండి. మళ్లీ వచ్చే అమావాస్యనాడు ఇంకో పసుపు రంగు వస్త్రం తీసుకొని అందులో తొమ్మిది నల్ల మిరియాలు వేసి మళ్లీ మూటకట్టి ఆ మూట కూడా అదే మేకుకు తగిలించాలి. ఇలా మీరు క్రమం తప్పకుండా తొమ్మిది అమావాస్యలు చేసి మళ్లీ పదో అమావాస్య రోజు ఈ తొమ్మిది మూటలు విప్పి ఆ గుడ్డలను ఒకదానిమీద ఒకటి పెట్టి ఈ మిరియాలన్నీ పోసి పెద్ద మూటలాగా కట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు కింద ఆ మూట వేసి ఇంటికి రండి. దీని ద్వారా మీకు ఆర్థికంగా కానీ, అప్పుల బాధలు కానీ, కుటుంబ పరంగా  సమస్యలు ఉంటే ఇట్టే తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: