తులసి మొక్క అనేది భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో భక్తికి మూలం ఈ మొక్క. సాధారణంగా భారతదేశంలో చెట్లను, రాళ్లను, పూజించడం అనేది పూర్వ కాలం నుండి వస్తోంది. ఇందులో ముఖ్యంగా తులసి మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మనం ఇప్పటి వరకు పాత సినిమాల్లో ప్రారంభంలోనే తులసి మొక్క దగ్గర ఒక పాటతో మొదలవుతుంది. అలాంటి సంప్రదాయం మన భారతదేశంలో ప్రతి ఇంట్లో ఉండేది. ఇంట్లో ఇల్లాలు పొద్దున్నే తల స్నానం చేసి ఎంతో నిష్టతో ఇంట్లో దేవుళ్ళ తో పాటుగా తులసి కోటకు ప్రతి రోజూ పూజ చేసేవారు. ప్రస్తుత కాలంలో కూడా తులసి మొక్క ప్రతి ఇంట్లో ఉంటుంది. చాలామంది ఈ మొక్క ఇంట్లో ఏ వైపు పెట్టుకుంటే వారికీ అదృష్టం వస్తుందో ఆ విధంగానే పెట్టుకొని పూజ చేస్తుంటారు. ప్రతిరోజు దానికి నీళ్లు పోయడం, మొక్క దగ్గర పూజ చేసి జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్న ఆచారం.
తులసి ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తారు. తులసి మొక్కను ఎందుకు ఇంటి దగ్గర పెట్టుకోవాలి. వేరే మొక్కలు పెట్టుకొని పూజించ రాదా.. దీనికి సమాధానం ఏంటంటే.. తులసి మొక్క సర్వరోగ నివారిణి.. అంతేకాకుండా తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చాలామంది నమ్ముతుంటారు. అందువల్ల ఆ మొక్కను ఇంటి దగ్గర పెట్టుకుంటే అటు ఆరోగ్యానికి మంచిది అలాగే లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. ప్రతిరోజు ఇల్లాలు ఆ తులసి కోట దగ్గర పూజ చేస్తూ స్వచ్ఛమైన గాలిని పీల్చుకొని ఆరోగ్యంగా ఉంటుంది. ఇంట్లో ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా ఆరోగ్యంగా ఉన్నట్టే.. అందుకనే పూర్వం పెద్దలు తులసి మొక్కకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుతమున్న శాస్త్రవేత్తలు ఈ తులసి మొక్కపై ప్రయోగాలు చేసి చాలా మంచి ఈ విషయాన్ని తెలియజేశారు.
ప్రపంచంలో చాలా మొక్కలు రాత్రి కూడా కార్బన్డయాక్సైడ్ విడుదల చేస్తే తులసి మాత్రం ప్రాణవాయువు అయినటువంటి ఆక్సిజన్ను మాత్రమే విడుదల చేస్తాయని తెలియజేశారు. చాలా మంది పూర్వ కాలంలో ఎవరైనా చనిపోయే ముందు చివరి క్షణాల్లో ఈ తులసి తీర్థాన్ని నోట్లో పోసేవారు. సర్వరోగ నివారిణి కాబట్టి ఒక్కోసారి ఈ తులసి తీర్థం నోట్లో పోస్తే వారు మళ్ళీ లేచేవారు. అలాగే ఈ తులసి తీర్థాన్ని మనం ఏదైనా దేవాలయం లోకి వెళ్ళిన మనకు ప్రసాదంగా ఇస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన టువంటి తులసి మొక్కను ఇంటి దగ్గర పెట్టుకుంటే మనకు ఆరోగ్య లక్ష్మి ఇంట్లో ఉన్నట్టే అని నమ్ముతారు.