శివుడికి ఇలా అభిషేకం చేస్తే కోటేశ్వరులు అవుతారట..!
ఎటువంటి వాటితో ప్రత్యేక అభిషేకం చేయాలి. అనే విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..శివుడిని నీటితో అభిషేకం చేయడం ద్వారా ఎంతో ప్రసన్నుడవుతాడు. అందువల్ల ప్రతి శివాలయంలోని శివుని లింగం పైభాగంలో ఒక నౌకను వేలాడదీస్తారు. అందులోనుంచి శివలింగం మీద నీరు పడుతున్నట్లు ఉంటుంది. నీటితో అభిషేకం చేయడం ద్వారా మన మనసు ఎంతో ప్రశాంతంగా కలిగి ఉండటమే కాకుండా, ప్రతికూల వాతావరణం నుంచి మనకు విముక్తి లభిస్తుంది. శివుడికి పాలాభిషేకం చేయడం ద్వారా దీర్ఘకాలికంగా వెంటాడుతున్న అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అంతేకాకుండా , సర్వ సౌఖ్యములు కలుగుతాయి.
శివుడికి అత్యంత ప్రీతికరమైన దళాలు మారేడు దళాలతో స్వామివారికి అభిషేకం చేయడం ద్వారా భోగభాగ్యాలు కలుగుతాయి. స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం ద్వారా మృత్యుదోష నివారణ లు కలగడమే కాకుండా శని ప్రభావం నుంచి విముక్తి పొందవచ్చు. అన్నంతో అభిషేకం చేయడం వల్ల అధికార ప్రాప్తి, కొబ్బరి నీటితో అభిషేకం వల్ల సకల సంపదలు కలుగుతాయి.. అంతేకాదు సోమవారం నాడు తెల్లని పూలతో పూజ చెస్తె భాధలు తొలగి సకల సంపదలు చేకూరుతాయని నమ్మకం.