పూజకి ఉపయోగించే ఈ పూలను ఎవరితోను తీసుకోకూడదట..!

Divya
మనం పురాతన శాస్త్రాలు తెలిపిన ప్రకారం.. దేవతలకు, రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధంలో సముద్రగర్భం నుంచి ఒక పారిజాత వృక్షం పుట్టింది.. ఈ వృక్షాన్ని మనం సాక్షాత్తుగా విష్ణుదేవుడు గా కొలుస్తాము. ఇక ఈ పూల చెట్టును విష్ణుదేవుడు ఒకేసారి స్వర్గానికి తీసుకువెళ్ళాడు అని వింటూ ఉంటాము. అయితే ఈ వృక్షం కి వచ్చిన పూలు సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి.ఇక ద్వాపరయుగం వచ్చిన తర్వాత సత్యభామ కోరికమేరకు ఈ పారిజాత వృక్షాన్ని భూమి మీదికి తీసుకురావాలని తెలియజేయడంతో.. కృష్ణుడు ఈ వృక్షాన్ని అక్కడ నుంచి తీసుకువచ్చారు.

అందుచేతనే ఆవృక్షాన్ని దేవతా వృక్షం గా భావిస్తూ ఉంటాము. ఇక ఈ పుష్పాల గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఇది ఎంతో ఎర్రటి కాడలను కూడా కలిగి ఉండి  తెలుపు వర్ణం కలిగిన పుష్పాలుగా ఉంటాయి. ఇవి తొమ్మిది రకాలుగా మనకి దొరుకుతూ ఉంటాయి. అయితే మనం పూజ చేసేటప్పుడు ఉపయోగించే పూలు ఏమాత్రం కింద పడకూడదు.. కేవలం తాజాగా చెట్టు మీద నుంచి కోసిన పూలతోనే మనం దేవుని ప్రార్థిస్తూ ఉంటాము. కానీ ఈ పూలను అలా చేయకూడదు.. కిందన రాలిపోయిన పువ్వులనే తీసుకువచ్చి దేవుడిని పూజించాలి.
అలా ఎందుకు చేయాలి అంటే.. సాధారణంగా ఏ చెట్టు అయినా భూమినుంచె పుట్టి ఉంటుంది.కానీ పారిజాత వృక్షం మాత్ర స్వర్గంలో నుంచి ఉద్భవించింది కనుక.. ఈ చెట్టు కు పూసే పువ్వుల ను భూమిని తాకిన అప్పుడే మనం వాటిని దేవుళ్లకు సమర్పించాలట, అందుచేతనే ఆ చెట్టు కింద ఎక్కువగా ఆవు పేడతో అలికి శుభ్రంగా చేస్తారు. ఇక ఇలా చేయడం వల్ల దేవతలు అనుగ్రహం పొందవచ్చని కొంతమంది పండితులు తెలియజేశారు. కానీ ఈ పూలను ఎవరి దగ్గర కూడా తీసుకొని పూజ చేయకూడదు. ఇలా చేయడం వల్ల మనం చేసేటటువంటి పూజ ఫలితం వారికి పోతుంది.
.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: