మోడీ : శ్రీకాశీ విశ్వనాధ్ ధామ్ కు.. ఇక పర్యాటక ఆకర్షణ..!

విశ్వనాథుడు వెలసిన కాశీలో నేడు ప్రధాని మోడీ కారిడార్ ను ప్రజలకు అంకితం చేయనున్నారు. దీని వలన వారణాసిలో పర్యాటకం బాగా అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. ఐకానిక్ దశాశ్వమేధ ఘాట్ కు సమీపంలో ఉన్న చారిత్రాత్మక కాశీ విశ్వనాథ్ దేవాలయం చుట్టూ ఉన్న ప్రవేశ ద్వారాలు, ఇతర నిర్మాణాలు, రాళ్ళూ, వస్తువులతో సాంప్రదాయ హస్తకళలతో అత్యాధునిక నిర్మాణాన్ని చేపట్టారు. దానిలో మొదటి దశ పూర్తికావడంతో, దానిని నేడు ప్రధాని ప్రజలకు అంకితం చేస్తున్నారు. పన్నెండు జోతిర్లింగాలలో ఒకటైన కాశీ టెంపుల్ సమీపంలోని వీధులలో చెక్కిన దీప స్తంభాలపై ఈ ప్రాజెక్ట్ దార్శనికతను గ్రహించినందుకు, మోడీని ప్రశంసిస్తూ పోస్టర్లు ఏర్పాటు చేశారు.  
కాశీ విశ్వనాథ్ టెంపుల్ వెబ్ సైట్ ప్రకారం ప్రసిద్ధ మతపరమైన స్థలాన్ని గోల్డెన్ టెంపుల్ అంటారు. నేడు మోడీ పర్యటన నిమిత్తం ఆయా ప్రాంతాలలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.  ఆలయ ప్రాంగణం సహా బహిరంగ వీధులలో పోలీసుల భద్రత ఏర్పాటు చేయబడింది. మొదటి దశలో 339 కోట్లతో పూర్తి చేశారు. దానిని నేడు మధ్యాహ్నం మోడీ ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ క్రింద విశ్వనాథుడిని త్వరగా చేరుకునేందుకు గాను, ప్రధాన ఆలయాన్ని మరియు గంగానదిని కలుపుతూ సులువైన మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంతం ద్వారా వికలాంగులు కూడా సులభంగా ఆలయంలోకి చేరుకునే సౌకర్యాలను కల్పించనున్నారు.
ఈ కారిడార్ ప్రారంభం అనంతరం కొంతకాలం పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు బీజేపీ ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు ప్రకటించారు. ఈ ప్రారంభోత్సవ సందర్భంగా ప్రధాని రెండు రోజులపాటు వారణాసిలోనే ఉండనున్నారు. నేడు బాబా కాలభైరవులను పూజలో పాల్గొంటారు. అనంతరం లలితా ఘాట్ చేరుకొని అక్కడ నుండి బాబా విశ్వనాథ్ ధామ్ ను చేరుకుంటారు. అనంతరం మోడీ గారు ఉపముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రులతో కలిసి గంగా హారతి కి హాజరవుతారు. రెండవ రోజు ఉమ్రా లోని స్వర్వేద్ దేవాలయంలో వార్షికఉత్సవాలలో పాల్గొంటారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగం కూడా చేయనున్నారు.
అయితే ఈ కారిడార్ ను రూపొందించే సమయంలో వారణాసిలో ప్రధాని అనేక ఆలయాలను ధ్వంసం చేస్తున్నట్టుగా విమర్శలు వచ్చాయి, కానీ దానికి సమాధానంగా అర్చిటెక్ మాట్లాడుతూ, ప్రధాన ఆలయాన్ని తాము ముట్టుకోలేదని, కేవలం దాని చుట్టూ పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఆయా సౌకర్యాలు కల్పించేందుకు ఆ ప్రాంతాన్ని సంసిద్ధం చేశామని చెప్పారు. ఈ కారిడార్ ప్రారంభోత్సవ సమయంలో ప్రధాని ఆయా మంత్రులు ఏర్పాటు చేసిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: