అక్కడ 21 రోజుల పాటు ఉత్సవాలు

అక్కడ 21 రోజుల పాటు ఉత్సవాలు

ఆయన పేరుకు మాత్రమే హిందూ దేవుడు. ఎక్కువగా విచ్చేసే భక్తులు మాత్రం అన్యమతస్తులు, ముఖ్యంగా చెప్పాలంటే ముస్లింలు. ఆయనే పార్వతీ పుత్రుడు గణనాధుడు. ప్రతిచోటా  గణేశ్ ఉత్సవాలు తొమ్మది రోజులు జరుగుతాయి.అదే విధంగా హిందూ దేవుళ్లకు జరిగే ఉత్సవాలున్నీ దాదాపుగా తొ మ్మిది రోజులే జరపడం పరిపాటి. వాటినే నవరాత్రి ఉత్సవాలంటారు. దర్గా నవరాత్రులు,  వసంత నవరాత్రులు,  గణేశ నవరాత్రులు...ఇలా పలు చోట్ల పలువురు దేవుళ్లకు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం పరిపాటి.
కానీ చిత్తూరు జిల్లాలో స్వయంభూగా వెలసి ఉన్న కాణిపాకంలోని వరసిద్ధి  వినాయకుని జరిగేే ఉత్సవాలు ప్రత్యేకం. అక్కడ 21 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. కాణిపాకం పరిసర గ్రామాల్లో 21 రోజుల పాటు  పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. కుల మతాలకు అతీతంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. కాణిపాకం గణపయ్య ప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధి కెక్కారు. స్వామి ఎదురుగా ఎవరైన ప్రమాణం చేసి అపద్దమాడితే స్వామివారు శిక్షిస్తాడని భక్కుల నమ్మకం. తాగుడు లాంటి వ్యసనాలకు బానిసైన వారు అక్కడకు వచ్చి ప్రమాణాలు చేయడం, దురులవాట్లకు దురమవడం నిత్యం జరుగుతోంటుంది. రాజకీయ నాయకులు నిత్యం కాణిపాకంలో ప్రమాణం చేద్దామా అని సవాల్ విసురుకోవడం మనం ప్రసార మాధ్యమాల్లో చూస్తుంటాం. దీనిని బట్టి ఈ బొజ్జ గణపయ్య పవరేంటో తెలుస్తుంది. ఇక్కడి ప్రమాణాలను బ్రిటీష్ కాలం నాటి న్యాయస్థానాలు ప్రామాణికంగా తీసుకున్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి.
 ఈ పార్వతీపుత్రుడి స్వయంభూ విగ్రహం నిత్యం పెరుగుతూ ఉంటుందని స్థానికులు చెబుతారు.  2000 వ సంవత్సరంలో భక్తులు స్వామివారికి చెయించిన వెండి కవచం ప్రస్తుతం స్వామి వారికి పట్టక పోవాడాన్ని వారు ఉదహరిస్తున్నారు. కాణిపాకం గ్రామం జిల్లా కేద్రం చిత్తూరుకు  12 కి.మీ. ప్రసిద్ధి చెందిన వైష్ణవ క్షేత్రం తిరుపతికి 75 కి.మీ దూరంలోనూ ఉంది. చిత్తూరు, బెంగుళూరు జాతీయ రహదారికి సమీపాన ఉండడంతో  రవాణా సౌకర్యాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. దీంతో భక్తుల సంఖ్య రెండు, మూడు సంవత్సరాల క్రితం వరకు ఎక్కువగా ఉండేది. కరోనా ప్రభావం కారణంగా కాణిపాకానికి భక్కుల రాక గతంతో పోలిస్తే తకువగా ఉంది.  ప్రభుత్వం ఈ ఏడాది నిర్వహించే ఉత్సవాలపై కరోనా ఆంక్షలు విధించింది. ఇరవై ఒక్క రోజుల పాటు ఉత్సవాలు యథావిధిగా జరుగుతాయి, కాకుంటే కొన్ని ఆంక్షలు,  సడలింపులతో ..విఘ్ననాయకుని ఉత్సవాలకు అడ్డంకులా మాజాకా..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: