తెలుగు సినిమాలో వినాయకుని పాటలు ఇవే?

VAMSI
దేవుళ్ళ విశిష్టతను తెరపై కనబరిచే ఎన్నో చిత్రాలను వెండి తెరపై చూసాము. అయితే వినాయక చవితి పండుగను హైలెట్ చేస్తూ వచ్చే సినిమాల క్రేజే వేరు. గణనాయకుడికి జేజేలు పలుకుతూ ఆయన్ని కీర్తిస్తూ వచ్చిన ప్రతి పాట సూపర్ హిట్టే. గణేశుని కి జై కొడుతూ పాడిన పాటలకు ఎవ్వరికైనా ఊపు రావాల్సిందే. సంతోషంతో చిందులు వేయాల్సిందే. గజేంద్రుని చరిత్రను, విశిష్టతను తెలియజేసే ప్రతి సన్నివేశం అమోఘమే. ఇలా వినాయకున్ని స్మరిస్తూ వచ్చిన పాటలు, సన్నివేశాలతో వచ్చిన చిత్రాలు ఎన్నో మనకు కనుల విందు చేశాయి. వినాయక చవితి సందర్భంగా వాటిని మరొకసారి ఆనందంగా గుర్తు చేసుకుందాం.
* విఘ్నేశ్వరుని చరిత్రను పూర్తి స్థాయిలో వెండితెరపై కనువిందు చేసిన చిత్రం ‘శ్రీ వినాయక విజయం’. ఈ సినిమాలో కృష్ణంరాజు, వాణిశ్రీలు శివపార్వతులుగా కనిపించారు. ఈ సినిమాలో విఘ్నేశ్వరుని పుట్టుక నుండి పూర్తి జీవిత కథ చెప్పబడింది. ఈ సినిమాలో ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలు వివరించబడ్డాయి.
* రాఘవేంద్రరావు డైరెక్షన్ లో విక్టరీ వెంకటేశ్ హీరోగా మనముందుకు వచ్చిన కూలీ నెంబర్ 1 మూవీలో  వినాయకుడిని కీర్తిస్తూ వచ్చిన  "దండాలయ్యా ఉండ్రాలయ్యా.."  పాట ఎంతగా అందరినీ ఆకట్టుకుందో తెలిసిందే. ఇప్పటికీ అంతే ఆదరణ పొందుతూ ఉంది.  
* అలాగే మెగాస్టార్ చిరు నటించిన జై చిరంజీవ సినిమాలో గణేషుడిని కీర్తిస్తూ వచ్చిన.." జై జై గణేశ జై కొడతా గణేశ" సాంగ్  ఇప్పటికీ వినిపిస్తూ అందరినీ అలరిస్తోంది.
* పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేశ్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న ‘పోకిరి’ మూవీలో జగడమే పాటలో  గణపతి బప్పా మోరియా అంటూ వచ్చే ఒక బిట్ ఎంతగానో హైలెట్ అయింది. వినాయక చవితి వచ్చిందంటే చాలు ఈ బీట్ వినిపించాల్సిందే. ఇలా వినాయకుడిని కీర్తిస్తూ వచ్చిన ఎన్నో పాటలు మరియు చిత్రాలు విజయాన్ని అందుకోవడమే కాదు గణనాయకుడు విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పాయి.
ఈ రోజు అన్ని ప్రదేశాలలో వినాయకుని ప్రత్యేక పాటలు భజనలతో హోరెత్తిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: