ఇక తిరుమలలో భక్తులకు కూడా సాంప్రదాయ భోజనం...

Sravani Manne
తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ ఎప్పుడు ప్రయోగత్మక కార్యక్రమాలను చేపడుతూ అందరికి ఆదర్శంగా నిలుస్తూనే ఉంటుంది.తాజాగా తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీ భక్తులకు కూడా సాంప్రదాయ భోజనంను ప్రయోగత్మకoగా అన్నమయ్య భవనంలో ప్రారంబించారు.ఈ సాంప్రదాయ భోజనంలో ప్రత్యేకత ఏమిటంటే దేశీయ గోవుల ఉత్పత్తులతో చేసిన వ్యవసాయం ద్వారా పండిచిన బియ్యం,పప్పు దినుసులు,బెల్లం,నెయ్యీ తో తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ ఇప్పటికే గోవిందునికి గో ఆదారిత నైవేద్యంతో శ్రీవారికీ అన్నప్రసాదాల నైవేద్యం అందిస్తున్న విషయం తెలిసిందే.అదే విధంగా దేశీయ వ్యవసాయం ద్వారా పండిచిన బియ్యం,పప్పు దినుసులతో తాయారు చేసిన అల్పాహారం,భోజనం ఉచితంగా అందించాలని సంకల్పించింది.

ఈ సంద‌ర్భంగా దేశీయ వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌కులు శ్రీ విజ‌య‌రామ్ మాట్లాడుతూ మ‌న పూర్వీకులు మ‌న‌కు అందించిన గో ఆధారిత వ్య‌వ‌సాయంతో పండించిన దేశీయ బియ్యం, ప‌ప్పుదినుసులు, కూర‌గాయ‌లను టిటిడి కోనుగోలు చేయ‌డం అభినంద‌నీయమ‌న్నారు. దీనిద్వారా దేశీయ విత్త‌నాలు, దేశీయ గో జాతులను గ్రామ‌ల్లోకి పునః ప్ర‌వేశ‌పెట్టవ‌చ్చ‌న్నారు.
అనంత‌రం చిరుధాన్యాల ఆహ‌ర నిపుణులు శ్రీ రాంబాబు మాట్లాడుతూ దేశీయ ఆవునెయ్యి, బెల్లం, గానుగ నూనెతో వంట‌లు వండి భ‌క్తుల‌కు వ‌డ్డిస్తున్న‌ట్లు తెలిపారు.

ఇందులో భాగంగా గురువారం ఉద‌యం కుల్ల‌కారు బియ్యంతో ఇడ్డీలు, కాలా బాత్ బియ్యంతో ఉప్మా త‌యారు చేసి అందించిన‌ట్లు తెలిపారు. ఇందులో శ‌రీరానికి అవ‌స‌ర‌మైన సూక్ష్మ పోష‌కాలు, అనేక వ్యాధుల‌ను ఎదుర్కొనే వ్యాధి నిరోద‌క శ‌క్తి ఉంటుంద‌న్నారు. మ‌ధ్యాహ్నం కొబ్బ‌రి అన్నం, పులిహోర‌, పూర్ణ‌లు, వ‌ర్ష రుతువులో తీసుకోవ‌సిన అహారమైన ప‌చ్చి పులుసు, దోశ‌కాయ ప‌ప్పు త‌దిత‌ర 14 ర‌కాల వంట‌కాలు చెఫ్ శ్రీ గోపి వండి భ‌క్తుల‌కు అందించిన‌ట్లు వివ‌రించారు. భ‌విష్య‌త్తులో ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోవ‌డం వ‌ల‌న మ‌న ఆరోగ్యంతో పాటు రైతు సంక్షేమం, గో సంక్షేమం,దేశం కూడా ఆర్థికాభివృద్ధి చెందుతుంద‌న్నారు.ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవోలు శ్రీ ర‌మేష్‌బాబు, శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, శ్రీ లోక‌నాథం, శ్రీ భాస్క‌ర్‌, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి,మాజీ బోర్డు స‌భ్యులు శ్రీ శివ‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: