వర "లక్ష్మి" వ్రత కథ ఇదే..!

Suma Kallamadi
శ్రావణమాసం వచ్చిందంటే ప్రతి ఇంటిలోనూ సందడి మొదలయిపోనట్లే అనే చెప్పాలి. శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలతో పాటు, శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంను వరలక్ష్మీ వ్రతంగా  జరుపుకోవడం ఎప్పటినుంచో వస్తున్న  ఒక హిందూ ఆచారం. వరలక్ష్మీ దేవత సాక్షాత్తు  విష్ణు మూర్తి భార్య. సకల వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు.అసలు వరలక్ష్మి వ్రతం చేయడం వెనుక గలకధ ఏంటో తెలుసుకుందామా. !పార్వతి దేవీ పరమేశ్వరునకు నమస్కరించి స్వామి !  లోకమున స్త్రీలు అందరు ఎటువంటి వ్రతం ఆచరిస్తే వాళ్ళకి సర్వ సౌభాగ్యంబులు, పుత్ర పౌత్రాదులం గలిగి సుఖంగా జీవిస్తారో  అట్టి వ్రతం నాకు చెప్పండి స్వామి అని పరమేశ్వరుడిని అడిగెను.పార్వతి దేవి అడిగిన ప్రశ్నకుపరమేశ్వరుడు ఇట్లుఅనెడు. ఓ దేవి స్త్రీలకు సకల, సుఖాలు సంపదలు కలుగ చేసే వరలక్ష్మీ వ్రతం అనే ఒక వ్రతంబు గలదు. ఆ వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చ శుక్రవారము నాడు ఆచరించాలి అని పార్వతీదేవికి చెప్పెను.అది విన్నా పార్వతి దేవి స్వామి మరి ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి.? ఇంతకముందు ఎవరన్నా ఈ వ్రతాన్ని ఆచరించారా.? ఏ దేవతను పూజింపవలయును? వివరింపవలయునని పరమేశ్వరుడిని ప్రార్థించిన పార్వతి దేవికి పరమేశ్వరుడు ఇలా చెప్తాడు  కాత్యాయనీ! వరలక్ష్మీ వ్రతమును సవిస్తరముగ జెప్పెద వినుము.

 మగధ దేశంలో  కుండినం అనే ఒక పట్టణం కలదు.ఆ పట్టణము అంతా బంగారు గోడలు గల యిండ్లతో రమణీయంగా ఉండేది.. అలాంటి పట్టణంలో  చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ గలదు. ఆ స్త్రీ భర్తను దేవునితో సమానముగ పూజించేది ప్రతి రోజు ఉదయాన్నే లేచి సూచి శుభ్రంగా స్నానంబుచేసి పుష్పాలతో  భర్తకు పూజచేసి తరువాత అత్తమామలకు సేవలు చేసి ఇంటిని చక్క బెట్టేది.అయితే ఒకరోజు రాత్రి చారుమతి నిద్రిస్తున్న సమయంలో  “ఓ చారుమతీ, నేను వరలక్ష్మీ దేవిని. నీయందు నాకు అనుగ్రహము గలిగి నీకు ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చె శుక్రవారమునాడు నన్ను పూజించిన నీవు కోరిన వరములు ఇచ్చెదను అని చెప్పెను. చారుమతీ దేవి ఆ దేవిని చూసి కలలోనే  వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి ‘ నీ కటాక్షం ఉంటే చాలు జనులు ధన్యులుగను తల్లి. , విద్వాంసులుగను సకల సంపన్నులు అవుతారు అని అనెను.ఒక్కసారిగా కల చెదిరిన తరువాత నిద్రలోంచి మేల్కొన్న చారుమతి ఇంటి నాలుగు వైపులా చూడగా ఎవరు లేరు. ఇది కలగా భావించి తనకు వచ్చిన ఈ స్వప్నమును భర్త అత్తమామలు,చుట్టు పక్కల స్త్రీలకు చెప్పెను.అలాగే చారుమతి స్వప్నంబు విన్న స్త్రీలు అందరు శ్రావణమాసం కోసం వేచి చూస్తూ ఉండెను. ఎప్పుడు వచ్చునాయని ఎదురు చూచుచుండిరి. శ్రావణ మాసం రానే వచ్చింది. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చెడి శుక్రవారము వచ్చెను. అంత చారుమతి  మొదలగు స్త్రీలందరు ఉదయాన్నే లేచి  స్నానాములు జేసి కొత్త బట్టలు కట్టుకుని చారుమతీదేవి గృహమునకు వచ్చేరి. పిదప దేవుని మండపం శుభ్రం చేసి ఆసనంబువైచి దానిపై కొత్తబియ్యం బోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచపల్లవంబులచేత కలశం ఏర్పరిచి యందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరు భక్తియుక్తులై లక్ష్మి దేవుని పూజించడం మొదలుపెట్టారు.
పూజల అనంతరం తొమ్మిది సూత్రములు గల తోరంబును దక్షిణహస్తమునకు గట్టుకొని వరలక్ష్మీదేవికి వివిధ రకాల ప్రసాదములు నివేదన జేసి ప్రదక్షిణము జేసిరి. మొదటి ప్రదక్షిణము జేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు ఘల్లుఘల్లుమను నొక శబ్దము కలిగెను. అంత కాళ్ళను చూడగా  గజ్జెలు మొదలగు నాభరణములు వచ్చెను. అవి చూసి స్త్రీలు అందరు సంతోషించి వరలక్ష్మీదేవి కటాక్షం వలన గల్గినవని అనుకున్నారు.రెండో  ప్రదక్షిణంబు జేయగా హస్తములందు నవరత్న ఆభరణములు కలిగెనో. మూడవ ప్రదక్షిణంబు చేయగానే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి. చారుమతి మొదలగు నా స్త్రీల అందరి గృహాలు బంగారు ఆభరణాలు విరిసిల్లెను! పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరంబును నీ వ్రతంబును చేయుచున్నారు.  కావున ఓ పార్వతీ! యీ యుత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారును చేయవచ్చును.అని శివుడు పార్వతికి చెప్పెను. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: