ఈరోజు శ్రావణ మాసం రెండవ గురువారం. వరలక్ష్మి వ్రతం ముందు రోజు రెండవ శ్రావణ గురువారం వస్తుందన్నమాట. అయితే రేపు వరలక్ష్మి వ్రతం అయితే ఈ రోజు సాయంత్రం ఆడవాళ్లు తప్పకుండా కొన్ని పనులను ఖచ్చితంగా చేయాలి..ఇలా చేయడం వల్ల ఇంట్లో ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది. శ్రావణ గురువారం రోజు తప్పకుండా చేయవలసిన పనులు ఏమిటి..? అనే విషయాలను గురించి ఇప్పుడు మనం పూర్తిగా విశ్లేషించుకుందాం..
శ్రావణ గురువారంలో ప్రతి ఒక్క మహిళ తలంటు స్నానం చేసి, అమ్మవారి ముందు నెయ్యి దీపం తో జ్వాలను ప్రతిజ్వలించాల్సి ఉంటుంది. ఇలా స్వచ్ఛమైన నెయ్యి దీపాన్ని అమ్మవారి ముందు వెలిగించడం వల్ల ఇంటి లోకి సకల సౌభాగ్యాలు వస్తాయని శాస్త్రం చెబుతోంది. అలాగే శ్రావణ మాసంలో ప్రతి గురువారం కూడా ఒక అరటి చెట్టుకు నీటిని సమర్పించి, అరటి చెట్టు మొదళ్ళలో ఆవునెయ్యితో దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం పొంది అష్టైశ్వర్యాలు ఇంటికి వస్తాయి.
అలాగే డబ్బు , శ్రేయస్సు సమాజంలో గౌరవం లాంటివి పొందాలి అంటే, ప్రతి శ్రావణ గురువారం రోజున రావి చెట్టుకు పాలు, బెల్లం కలిపిన నీటిని సమర్పించాలి. ఇలా చేస్తే మీ ఇంట సిరి సంపదలు పెరుగుతాయి. ఇక లక్ష్మీకటాక్షం వేగంగా పొందాలి అంటే , పెళ్ళైన ఆడవారు ఆవు నెయ్యి కలిపిన పసుపును శరీరానికి పట్టించుకుని, ఆ తర్వాత స్నానం చేయడం వల్ల అమ్మవారు కటాక్షిస్తున్నారు అని పండితులు చెబుతున్నారు. ఇలా ప్రతి శ్రావణ గురువారం చేయడం వల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోయి, ఇంటికి అష్ట ఐశ్వర్యాలు వస్తాయట.
సాధారణంగా గురుబలం ఉంటేనే దంపతుల మధ్య సఖ్యత, సమాజంలో గౌరవం, అష్ట ఐశ్వర్యాలు, సంతాన సౌభాగ్యం ఇవన్నీ ప్రసాదించబడతాయి. అంటే మన మీద గురు బలం ఉండాలి అంటే , గురుడు కి ఇష్టమైన రోజు గురువారం కాబట్టి , ఈ రోజున తప్పకుండా మహిళలు ఇలాంటి పద్ధతులు పాటిస్తే ,తప్పకుండా వారి కుటుంబం పై గురు ప్రభావం కలిగి, ఎన్నటికీ కష్టాలు రాకుండా ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం కూడా చెబుతోంది.