ఈ వ్రతాలతో శ్రావణ లక్ష్మి మీ ఇంట్లోనే ?

VAMSI
మహిళలకు ఎంతో ప్రీతికరమైన శ్రావణ మాసం వచ్చేసింది. ప్రతి ఇంటా పచ్చటి తోరణాలు, పూజలు, వ్రతాలు, ముత్తైదువుల సందడి ఇలా ప్రతి ఇల్లు ఎంతో కళకళలాడుతుంటుంది. అయితే అత్యంత పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో ఎటువంటి పూజలు చేస్తే మన ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందో, ఆ అమ్మవారి కటాక్షం కలుగుతుందో తెలుసుకుందాం. ఈ మాసంలో చంద్రుడు శ్రావణ నక్షత్రములో సంచరించడం చేత ఈ మాసముకు శ్రావణ మాసం అని పిలవబడుతోంది. మహా విష్ణువు సతీమణి అయిన శ్రీ మహాలక్ష్మికి శ్రావణ మాసం అంటే మహా ప్రీతికరం అని పురాణాలు చెబుతున్నాయి. అట్టి ఈ మాసంలో అమ్మవారిని ఎంతో నిష్టతో పూజలు చేసినా, వ్రతాలు చేసినా వాటి ఫలితం కొన్ని వేల రెట్లు ఎక్కువగా ఉంటుందట. 

అంతేకాదు వివాహాలు, శుభకార్యాలు,నూతన వ్యాపార ప్రారంభాలు ఇలా అన్ని మంచి పనులను ఈ మాసంలో చేయడం ద్వారా శ్రీ మహా విష్ణువు, మహాలక్ష్మి ల అనుగ్రహానికి పాత్రులై శుభ ఫలితాలు అందుకుంటారు. ఇక శ్రావణ మాసంలో మహిళలు ప్రత్యేకించి వరలక్ష్మి వ్రతం, మంగళ గౌరీ వ్రతం, శ్రావణ సోమవారాలు, శ్రావణ శనివారాలు, శుక్ల పక్ష పౌర్ణమి, నాగ పంచమి, కృష్ణాష్టమి వంటి     అత్యంత పవిత్రమైన విశిస్టమైన పండుగలను ఎంతో సంతోషంగా జరుపుకుంటుటారు. ప్రతి పూజ దేనికదే ప్రత్యేకం. ఈ మాసంలో చేసేటటువంటి ఏ పూజనైనా సరే భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో చేస్తే మంచి ప్రతి ఫలితాలు తప్పక మీ సొంతం అవుతాయని పండితులు చెబుతున్నారు.

ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో చేసే మంగళ గౌరీ వ్రతం మరియు వరలక్ష్మి వ్రతం వివాహితలకు ఎంతో ముఖ్యమైనది. వారి పసుపు కుంకుమలు  పది కాలాల పాటు చల్లగా కాపాడి మాంగళ్య బలం మరింత పటిష్టంగా మారేందుకు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.  కావున పెళ్ళైన స్త్రీలు తప్పకుండా ఈ రెండు వ్రతాలను చేయుట మంచిదని అంటున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: