దేవుని దృష్టిలో అందరూ సమానులే...

VAMSI
ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో ప్రజల జీవితాలు ఉరుకులు పరుగులుగా ఉన్నాయి. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే ముందు వరకు ఎప్పుడూ కూడా ఏదో ఒక పనితో బిజీగా ఉంటున్నారు. దేవుడంటే భక్తి ఉన్నా పూజలు చేసే సమయం లేకా చాలా బాధపడుతుంటారు. పూజ చేయడం అంటే ఎంతో సమయం వెచ్చించాల్సి వస్తుందని అందు కొరకు కావాల్సిన సమయం వారు కేటాయించలేక పోతున్నారని చాలా బాధ పడుతుంటారు. మరో వైపు దేవుడిపై కేవలం భక్తి ఉంటే సరి పోదని పూజలు చేస్తే నిత్యం పూజలు చేస్తే తప్ప దేవుడు మనల్ని కరుణించడేమోనని భయపడుతుంటారు. కానీ వాస్తవానికి దేవుడు అలా తనని సేవించిన వారిని మాత్రమే కరుణిస్తాడు అని లేదు. ఇది పండితులు చెబుతున్న మాట.
దేవునిపై నిజమైన విశ్వాసం ఉండి, ఆయనపై భక్తి ఉంటే చాలు అంటున్నారు. దేవుడికి పక్షపాతం ఉండదు ఆయన దృష్టిలో మనుషులందరూ సమానమే.. తన బిడ్డలే. అలాంటి తన బిడ్డలను ఎప్పుడూ కాపుకాస్తుంటారని అంటున్నారు. కాగా పెద్దగా పూజ కార్యక్రమాలు చేయలేకపోయినప్పటికీ దీపారాధన చేసి మనస్పూర్తిగా వేడుకున్నా సరే మనకు ఆ దేవుని అనుగ్రహం లభిస్తుందని అంటున్నారు. అంతే కాదు మానవ సేవయే మాధవ సేవ అన్న సామెత అందరూ వినే ఉంటారు. అలాంటిది ఏ మనిషి అయితే తమ తోటి వారిని ప్రేమిస్తూ వారి మేలును కోరుకుంటారో అటువంటి వారికి ఆ దేవుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.
భక్తులందరూ ఒక విషయం తెలుసుకోవాలి. దేవుడు మనుషుల్ని చూసే విధానంలో ఎటువంటి తారతమ్యాలు చూపించరు.  ఆ భగవంతుని దృష్టిలో అందరూ సమానమే. ఎవ్వరికి కష్టమొచ్చినా వచ్చి కాపాడుతాడు. ఆపదలో ఉంటే కరుణిస్తాడు. ఆయనే స్వయంగా వచ్చి సాయం చేయకపోయినా, ఎవరో ఒకరి చేత ఆ కార్యాన్ని పూర్తి చేస్తారు. కాబట్టి దేవుని యందు పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండండి. అంత మంచే జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: