సూర్యనమస్కారం చేయడం వలన ప్రయోజనాలివే ?
ముఖ్యంగా ఆదివారం నాడు సూర్య నమస్కారం చేయడం వలన మీకు అంతా శుభమే జరుగుతుంది మరియు అత్యంత పుణ్యఫలం లభిస్తుంది. ప్రతి రోజూ సూర్య నమస్కార స్తోత్రం పఠించడం ద్వారా జీవితంలో చీకటితో కూడుకున్న కష్టాలు తొలగిపోయి సుఖాలను పంచే వెలుగులు వెదజల్లుతాయి. అందుకే ఆదివారాన్ని భానువారం అని కూడా అంటారు. సూర్యదేవుని ఉదయభానుడు, భానోదయుడు అని కూడా అంటారు. పొద్దున్నే సూర్యనమస్కారాలు చేయడం ద్వారా ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వివిధ భంగిమలతో చేసే సూర్య నమస్కారాలు మంచి ఆరోగ్యపరమైన లాభాలు ఇస్తాయి. సూర్య నమస్కారం చేసే సమయంలో శరీరంలోని మలినాలు చెమట రూపంలో బయటకు పోవడం వలన చర్మం, ముఖం కాంతివంతంగా మారుతుంది.
అంతే కాకుండా శరీరంలోని అన్ని చర్యలు చక్కగా జరుగుతాయని ప్రతీతి. చిన్నపిల్లలకు కూడ సూర్య నమస్కారాలు అలవాటు చేయించడం చాలా ఉత్తమం. చిన్నప్పటి నుండే వారికి సూర్య నమస్కారాలు అలవాటు చేయడం వలన వారిలో భక్తి భావం పెరుగుతుంది. అదే విధంగా వారు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ విధంగా ప్రతీరోజూ ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం వలన వివిధ ప్రయోజనాలు ఉన్నాయి.