శుభకార్యాలకు వెళ్లే ముందు పిల్లి ఎదురొస్తే అశుభమా ?

VAMSI

సహజసిద్ధంగా ఏదైనా శుభకార్యాలకు సంబంధించి ఇంటి నుండి బయలుదేరేటప్పుడు పిల్లి ఎదురు వస్తే కంగారు పడతారు. అందులోనూ నల్ల పిల్లి ఎదురైతే ఖచ్చితంగా ఏదో అరిష్టం జరగబోతుందని ఆందోళన చెందుతారు. ఇదేంటి శుభమా అని బయలుదేరుతుంటే ఇలా పిల్లి ఎదురయింది అనుకుని తెగ బాధపడిపోతుంటారు. ఇప్పుడు వెళ్లాలా వద్దా అని అనేకమార్లు ఆలోచిస్తారు. పెద్దవాళ్ళకి చెప్పి సలహాలు అడుగుతుంటారు. అయితే పిల్లి ఎదురుగా వచ్చి నప్పుడు అసలు ఏం చేయాలి అన్న వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లి శకునం అనేది శకున శాస్త్రంలో విశేషమైన ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. పెంపుడు జంతువైన పిల్లికి సంబంధించి హిందూ ధర్మంలో అనేక నమ్మకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైనా శుభకార్యాల కోసం లేదా, ముఖ్యమైన పనుల కొరకు బయటకు వెళ్ళే ముందు పిల్లి కనుక ఎదురు వస్తే అశుభంగా భావిస్తాము. అందులోనూ అది నల్ల పిల్లి అయితే ఇక ఏదో కీడు జరగబోతుందని బాధపడతాము. మనం బయలుదేరే ముందు పిల్లి కనుక ఎదురు వస్తే ఇంటిలోకి  వెళ్లి దేవునికి నమస్కరించి మళ్ళీ తిరిగి బయలుదేరడం మంచిదంటున్నారు పండితులు.
ఇక పిల్లులు కనుక కలలోకి వస్తే ఏమిటి అన్న వాటికి కూడా మన పురాణాలలో కొన్ని వివరణలు ఇవ్వడం జరిగింది. కలలో కనుక తెల్ల పిల్లి కనిపిస్తే ఆర్థిక సమస్యలో లేదా అనారోగ్య సమస్యలో రాబోతున్నట్లు సూచనట. ఒకవేళ నల్ల పిల్లి కలలో కనిపిస్తే వారికి మానసిక సమస్యలు ఎదురవుతాయి అని పండితులు అభిప్రాయపడుతున్నారు. ఏదో ఒక రకంగా ఎక్కువగా మానసిక ఒత్తిడికి లోనయి ప్రశాంతత కోల్పోతారని చెబుతున్నారు.

ఇలా కలలో కనుక పెళ్లి కనిపిస్తే మరుసటి రోజు తలస్నానం ఆచరించి గుడికి వెళ్లి దేవుని దర్శించుకుని అంతా మంచే జరగాలని కోరుకోవాలని అంటున్నారు. ఇవి అన్నీ కూడా పూర్వం ఆచరించే వారు. కానీ మన కర్మ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైనా చేసే  ముందు ఆలోచించుకుని చేయండి. ఇటువంటి వాటికి కట్టుబడాలని ఏమీ లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: