దేవుని పూజా సమయంలో పాటించాల్సిన నియమాలివే ?

VAMSI
సాధారణంగా హిందువులకు పూజలు, యాగాలు మరియు యజ్ఞాలపై నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా నిత్యం చేసే పూజ ద్వారానే తమ కోరికలు నేరుగా వారి ఇష్ట దైవాలకు అందుతాయని విశ్వసిస్తుంటారు. పూజను నిత్యం ఎంతో పవిత్రంగా చేసే భగవంతుడు యొక్క కార్యక్రమమని విశ్వసిస్తుంటారు. అయితే ఎంతోమంది భక్తులకు అసలు పూజలు చేయాల్సిన సరైన పద్ధతి ఏమిటా అనే సందేహం ఉంటుంది. అంతేకాక పూజ చేసే సమయంలో పాటించవలసిన నియమాలు ఏమిటి ఎలా పాటించాలి అన్న ధర్మ సందేహాలు కలుగుతుంటాయి. అయితే పూజ చేయాల్సిన సరైన పద్ధతి ఏమిటి, పూజ చేసే సందర్భంలో ఎలాంటి నియమాలు పాటించాలి అన్న దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 పూజ పద్ధతుల విషయానికొస్తే..


* ముందుగా పూజగదిని శుభ్రం చేసుకుని పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి.


*చేతికి అందుబాటులో అన్ని పూజ వస్తువులను ఉంచుకోవాలి.


* మహిళ నుదుటిన కుంకుమ లేదా విభూది బొట్టు లేనిదే పూజ ప్రారంభించరాదు.


* కంచు చెంబులో  నీటిని, దేవునికి నైవేద్యం పెట్టడాన్ని మర్చిపోరాదు.


* ముందుగా దీపారాధన చేయాలి, పూజకు సంబంధించిన వస్తువులు తీసుకునే సమయంలో కుడి చేతిని మాత్రమే వినియోగించాలి. ఆ తర్వాత కడ్డీలను వెలిగించి, తొలుత విఘ్నేశ్వరునికి నమస్కరించుకొని ఓం గజాననాయ నమః అంటూ మూడు సార్లు జపించాలి. ఆ తర్వాత మీ ఇష్టదైవాలకు సంబంధించిన శ్లోకాలు చెప్పవచ్చు. అనంతరం దేవునికి హారతి ఇవ్వాలి.


* హారతి ఇచ్చిన తర్వాత మాత్రమే మీ ప్రార్థనలను దేవునికి విన్నవించాలి.


* జుట్టు విరబోసుకుని పూజను అసలు చేయరాదు.


* దీపారాధనకు రెండు దీపపు కుందులు లేదా ఒక దీపం కుంది కూడా వాడవచ్చు.


అయితే ఒకటి మాత్రమే వినియోగించే సమయంలో దీపపు కుందిలో  రెండు వత్తులను వేసి వెలిగించాలి. ఇలా కొన్ని పద్ధతులను తప్పక పాటించాలి. పై విధంగా మీరు పూజ చేసినట్లయితే మీరు కోరుకునే కోరికలు తప్పక తీరుతాయని భక్తుల నమ్మకం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: