ఆధ్యాత్మికం: పూజా మందిర నియమాలు...?

VAMSI
హిందువులలో ఎంతోమంది ఇప్పటికీ నిత్యం పూజలు చేస్తుంటారు. ఇక పండుగల సమయాలలో అయితే ప్రత్యేక పూజలు జరుపుతుంటారు. హిందూ మతం అతి పురాతన మతం. దీనినే 'సనాతన ధర్మం' అని కూడా అంటుంటారు. దేవుడంటే వారికొక నమ్మకం. ప్రతి కర్మకు మూలం ఆ దైవమేనని విశ్వసిస్తుంటారు. దేవుళ్లకు ఎంతో సంతోషంగా, శ్రద్ధగా నిత్యం పూజ చేస్తుంటారు. అయితే పూజ చేసే విధానంలో చాలా మందికి కొన్ని సందేహాలు ఉంటాయి. వాటిలో ఒకటి ఏ ఏ దేవుళ్ళు చిత్ర పటాలను ఎక్కడ ఉంచాలి అన్నది. ఈ విషయం చాలా మందికి తెలియక పోవచ్చు. ఇప్పుడు ఈ అంశం గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం.

ఇంట్లో దేవుడి గది చాలా ప్రత్యేకం. దేవుడు గది ఎప్పుడూ కూడా ఈశాన్యం వైపు మాత్రమే ఉండాలి. ఒకవేళ దేవుళ్ళ చిత్ర పటాలను గోడకు వ్రేలాడతీయాలి అనుకుంటే దక్షిణ, పశ్చిమ వైపు ఉన్న గోడలకు తగిలించాలి. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే పూజ గదిలో.. చాలా మంది వారి పెద్దవాళ్ల ఫోటోలను పెట్టి పూజిస్తుంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదు. వారిపై గౌరవం ఉన్నప్పటికీ... వారి చిత్ర పటాలను పూజ గదిలో ఉంచరాదు. ఇక పోతే పూజా మందిరంలో మొదటగా ఆ వినాయకుని యొక్క చిత్ర పటాన్ని కానీ, లేదా ప్రతిమను కానీ ఉంచాలి. మనం చేసే ఏ కార్యక్రమానికైనా ముందుగా ఆదిదేవుడైన ఆ గణపతిని పూజిస్తాము.

అదేవిధంగా విఘ్నాలను తొలగించే గణేశుని ప్రతిమను... పూజా మందిరంలో మొదటిగా ఉంచాలి. మీ ఇష్ట దైవం యొక్క ప్రతిమను లేదా విగ్రహాన్ని వుంచాలి. ఆ తర్వాత మిగిలిన దేవుళ్ళ చిత్ర పటాలను చుట్టూ అమర్చుకోవాలి. ప్రతి పూజా మందిరంలో గణేశుని చిత్రపటం, అదే విధంగా ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క చిత్ర పటాన్ని ఖచ్చితంగా ఉంచాలి. ఇలా ఒక పద్దతిలో దేవుల ప్రతిమలను ఉంచి కనుక పూజలు చేసినట్లయితే దేవునికి మీపై ఒక విశ్వాసం ఏర్పడుతుంది. దీనితో మీతో పాటు మీ ఇంటిని ఎటువంటి కష్టం రాకుండా కాపాడుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: