ఈ ఏకాదశి ప్రత్యేకతలివే...?
ఇక ఈ సంవత్సరం ఏకాదశి ఏ రోజు, ఏ సమయం వచ్చిందని వివరాలు చూస్తే....2021 సంవత్సరంలో పాపమోచని ఏకాదశి ఈరోజు అనగా ఏప్రిల్ 7వ తేదీన అర్థరాత్రి 2 గంటల తొమ్మిది నిమిషాలకు ప్రారంభమయింది. ఇది తిరిగి మరుసటి రోజు అంటే.. ఏప్రిల్ 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ ఏకాదశి ముగుస్తుంది. ఏకాదశి శుభ ముహూర్త సమయం ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 8:40 గంటలకు. ఈ సమయంలో శ్రీమహా విష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే మన పాపాలన్నీ తొలగిపోయి సంతోషకరమైన జీవితం లభిస్తుంది. కాబట్టి ఈ ఏకాదశికి అందరూ అన్నీ సిద్దం చేసుకొని ఆ దేవుడిని ఎంతో నిష్టగా పూజించండి.
పాపమోచని నాడు సూర్యోదయం ముందు లేచి స్నానం ఆచరించి ఆ దేవునికి 11 పసుపు పువ్వులు, మరియు 11 రకాల స్వీట్లను దేవునికి సమర్పించి, శ్రీ మహా విష్ణువుకు పసుపు గంధపు చెక్కకు పసుపు రంగు పూసి పూజించాలి. అనంతరం మీరు పీఠంపై కూర్చొని విష్ణువు యొక్క మంత్రాలను జపించాలి. అలా పూజించడం వలన ఆ శ్రీ మహా విష్ణువు యెక్క కృపకు పాత్రులు కాగలరు. తద్వారా మన జీవితం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. మళ్ళీ చెబుతున్నాము ఇది ససంవత్సరంలో వచ్చే అతి ముఖ్యమైన ఏకాదశి కావున, మీ భక్తిని నిరూపించుకోండి.