
పూజ చేయడానికి ఏ సమయం మంచిది...?
అదే విధంగా పూజ చేసే సమయంలో చాలా మంది దీపారాధన చేసే సమయంలో చాలామంది తెలియక ఒక తప్పు చేస్తూ ఉంటారు. దీపారాధన ఒత్తులను అగ్గిపుల్లలతో వెలిగిస్తుంటారు ఇది సాధారణంగా అందరూ చేసే పనే. కానీ అలా చేయడం అపచారమట. కాబట్టి దీపారాధన చేయడానికి మొదట అగ్గి పుల్లతో కొవ్వొత్తిని వెలిగించి, ఆ కొవ్వొత్తితో దీపాలను వెలిగించాలట. అలా చేయడం వల్ల దైవానుగ్రహం పొందుతారట. దేవుడి కృపకు పాత్రులవుతారట. అదే విధంగా దేవుడికి మనకు ఉన్నంతలో ఎదో ఒక నైవేద్యం తప్ప్పక పెట్టాలి. నీరు, నైవేద్యం పెట్టాకే పూజ చేయాలని పండితులు చెబుతున్నారు. '
అలాగే పూజ చేసే సమయంలో ఇంటి గుమ్మం ముందు... ఇంటి లోపల ఎటువంటి చెత్తా ఉండరాదు. ఎంతో శుభ్రంగా ఉంచాలి. అప్పుడే పూజా ఫలితం దక్కుతుంది. ఇల్లు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆ శ్రీమహా లక్ష్మీ మన ఇంట్లో కొలువై ఉంటుంది. ఇంటి లోపల మాత్రమే కాదు ఇంటి వెలుపల అంటే వాకిలి ముందు కూడా శుభ్రంగా ఉండి అందమైన ముగ్గులు వేసి ఉంచాలి. అప్పుడే మహాలక్ష్మి ఇంటి లోకి ప్రవేశిస్తుంది. మన జీవితం ఎంత బిజీగా ఉన్నా ఆ దేవుడికి పూజ చేయటం మాత్రం మాన కూడదు.