స్త్రీలు ఈ వారాల్లో తలస్నానం చేస్తున్నారా...?

VAMSI
తరచూ అందరూ తల స్నానం చేస్తుంటారు. కానీ   దేవుడి పూజ కోసం తల స్నానం చేసేవారు, వారి ఇష్టదైవాలను పూజించే రోజు తల స్నానం చేస్తుంటారు. రోజూ చేస్తే ఏ ఫలితం వస్తుంది, అనే విషయం గురించి శాస్త్రం మనకు కొన్ని ఆరోగ్య సూచనలు చేసింది. వాస్తవానికి తలస్నానం అనేది  రోజు చేయడానికి అందరికీ వీలవదు. అలాంటప్పుడు వారంలో రెండు మూడు ప్రత్యేక రోజుల్లో మాత్రమే తల స్నానం చేస్తుంటారు. అలాంటి  వారికోసం ప్రత్యేకించి వారంలోని కొన్ని దినాలలో తలస్నానం చేస్తే ఆరోగ్యకరమైన శరీరం కలిగి ఉండడమే కాకుండా, అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది అని  మన శాస్త్రాలు చెబుతున్నాయి.
 
అదేవిధంగా మిగిలిన రోజుల్లో తలస్నానం చేస్తే అనారోగ్యమైన పరిస్థితి మరియు ఇతర విషయాలలో ప్రతికూలంగా ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి తలస్నానం ఏ రోజుల్లో చేస్తే మనకు మేలు జరుగుతుందో తెలుసుకోవాలి. సోమవారం రోజు తలస్నానం చేయరాదు. ఫలితం కలవరము, కాంతిహీనం,భయం  కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. దోష పరిహారం కొరకు కొబ్బరినూనెలో మందారపూలను వేసి తలంటుకొని స్నానం చేస్తే దోష పరిహారం కాగలదు. మంగళవారం నాడు స్త్రీలు అసలు తలస్నానం చేయకూడదు.

ఫలితం విరోధం, అపాయం, ఆయుక్షీణం, భర్తకు పీడ కలుగుతుంది.
బుధవారం తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.  లాభం, కీర్తి, సంపద కలుగును, జ్ఞానము పెరుగుతుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
గురువారం రోజు తలస్నానం కూడా మంచిది కాదంటున్నారు. ఫలితం అశాంతి, విద్యా లోపము,  కీడు వంటివి జరుగుతాయని చెబుతున్నారు. శుక్రవారం నాడు తలస్నానం చేస్తే మంచిది అని అందరూ అనుకుంటారు కానీ శాస్త్రాల ప్రకారం శుక్రవారం తలస్నానం చేసిన ఫలితం. అశాంతి, వస్తు నాశనం, జరుగుతాయని చెబుతున్నారు. శనివారం తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆయుస్సు వృద్ధి, వస్తు సేకరణ లాభం, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. ఆదివారం నాడు తలంటు స్నానము చేయకూడదట. కలత,అనారోగ్యం ఏర్పడుతుంది, దు:ఖప్రదం, సంతానంకు కీడు జరుగుతాయని చెబుతున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: