శ్రీ వేంకటేశుని ఇలా పూజించండి...కష్టాలన్నీ తీరిపోతాయి...!

VAMSI
ఏడుకొండలపై కొలువై ఉండే  ఆ కోనేటి రాయుడు తిరుమలలో కలియుగ దేవుడిగా ప్రజల చేత విశేష పూజలు అందుకుంటున్నాడు. లోక కళ్యాణం కోసం అవతరించిన ఆ వెంకటేశ్వర స్వామి  అంటే ఇష్టం లేని హిందువు ఉండడు. కొందరు ప్రత్యేకించి వెంకటేశ్వరుడిని తమ ఇంటి ఇలవేల్పుగా పూజిస్తుంటారు. అలాంటి వారు శ్రీనివాసునికి ప్రీతికరమైన శనివారం నాడు ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మనం దేవుళ్లకు పూజలు చేయడానికి కారణాలు  దేవుని యొక్క చల్లని చూపు ఎప్పుడూ మన పై ఉండాలని, ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా జీవితం సాఫీగా సాగిపోవాలని, మన కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని, కానీ ఇవన్నీ మనకు లభించాలి అంటే పూజను ఎటువంటి పొరపాట్లు లేకుండా సంపూర్ణంగా జరపాలి.
అలాంటి వారు  పూజా పద్ధతి కి సంబంధించిన ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి. ఇప్పుడు అవేంటో చూద్దాం...!
శనివారం నాడు వెంకటేశ్వర పూజ చేయాలనుకునేవారు ఈ విషయాలను తెలుసుకోవడం ముఖ్యం. శనివారం నాడు ప్రత్యేక పూజలు చేయడం వలన శనీశ్వరుని దృష్టి మనపై పడకుండా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అఖిల కోటి బ్రహ్మాండ నాయకుడు అనుగ్రహం పొందాలంటే కొన్ని నియమాలతో పూజ ఆచరించాలి. ముందుగా ఇంటిని మొత్తం శుభ్రం చేసి పూజకు సిద్ధం చేసుకోవాలి. దేవుడి మందిరాన్ని పువ్వులతో అలంకరించాలి. దీప దీపాలతో నైవేద్యం సమర్పించాలి. భక్తిశ్రద్ధలతో శ్రీవెంకటేశుని నామాలను జపించాలి.
శనివారం నాడు పూజ  సమయంలో పద్మావతి అమ్మవారిని స్తుతించే మూలమంత్రం జపించాలి. లేదా వింటూ పూజలు చేయాలి. అలా చేస్తున్న పూజలో పాల్గొన్నా సరే అనుగ్రహం పొందుతారు.
ఆ శ్రీనివాసుని శనివారం నాడు షోడశ నామాలతో అర్చించాలి. ఈరోజు లేని వారికి దానం చేయడం మంచిది. దేవునికి పెట్టిన నైవేద్యాన్ని వీలైనంత మందికి పంచాలి. ఇలా భక్తిశ్రద్ధలతో పూజలు ఆచరించటం వలన ఆ కలియుగ దేవుని అనుగ్రహానికి పాత్రులవుతారు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: