జనవరిలో వచ్చే ముఖ్యమైన పండుగలు...వాటి విశేషాలివే...?

VAMSI
పాత సంవత్సరం 2020 కి బై బై చెప్పేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. పోయిన సంవత్సరంలాగా కాకుండా అందరికీ సంతోషాన్ని మరియు ఆనందాలను తీసుకువచ్చిందని నమ్ముతున్నాము. ఈ సంవత్సరం అంతా మంచిగా జరగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము. అంతే కాకుండా కొత్త సంవత్సరంతో పాటుగా ఈ నెలతో కొత్త పండుగలు మరియు ఉపవాసాలు కూడా ప్రారంభం కానున్నాయి. గడిచిన సంవత్సరంలో ఎన్నో పండుగలు ఎంతో వైభవంగా జరుపుకోవాల్సింది కానీ మహమ్మారి కరోనా వైరస్ వ్యాపించడం వలన అందరూ ఇంటి పట్టునే ఉన్నారు. దీనితో అందరిలో ఉత్సాహం తగ్గిపోయింది. ఈ సంవత్సరం పైన ప్రజలందరికీ చాలా అంచనాలు ఉన్నాయి.
ఇక పోతే జనవరి నెల అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది సంక్రాంతి పండుగ. ఇందులో జరిగే పొంగల్, కోడి పందేలు, జల్లికట్టు కార్యక్రమాలు అందరికీ గుర్తొస్తాయి. ఈ సారి ఏ రోజులలో ఈ పండుగలు వచ్చాయో ఇప్పుడు మన ఏపీహెరాల్డ్ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాము. జనవరి నెలలో 9 వతేదీన వచ్చే తొలి సఫాలా ఏకాదశి రోజున అనేక మంది ఉపవాసాన్ని పాటిస్తారు. ప్రతి సారి కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశినే సఫాలా ఏకాదశి అంటారు. కాగా ఈ రోజునే విష్ణుమూర్తిని కూడా ఆరాధిస్తారు. అలాగే జనవరి 10 వతేదీన కృష్ణ ప్రదోష్ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ వ్రతాన్ని పరమేశ్వరునికి ఇష్టమైనదిగా కొలుస్తారు.  కృష్ణ పక్షంలోని చతుర్దశి లో ప్రతి మాసంలోనూ శివ రాత్రిని జరుపుకుంటూ ఉంటారు. ఈ నెలలో వచ్చే శివ రాత్రి రోజున అందరూ ఉపవాసం ఉంటారు.  ఇది 11 వతేదీన వస్తుంది.
అలాగే జనవరి 13 వతేదీన భోగి పండుగ వస్తుంది. ఈ రోజు ఇంట్లో అందరూ ఉదయాన్నీ లేచి భోగి లో కాచిన వేడి నీళ్లతో స్నానం చేస్తారు. తమ ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు వేస్తారు. పిల్లలు పెద్దలు ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. తరువాత రోజు అంటే జనవరి 14 వ తేదీన మకర సంక్రాంతి వస్తుంది. సూర్య భగవానుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి సంచరించనప్పుడు మకర సంక్రాంతి అంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సమయంలో కోడి పందేలు ఎక్కువగా నిర్వహిస్తారు. తమిళనాడు జల్లికట్టు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో రైతుల పంట చేతికొచ్చి ఉంటుంది. అందుకే ఈ పండుగను మూడురోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి తర్వాత కనుమ పండుగ రోజున మాంసాహారం తీసుకుంటారు. ఇలా ఈ సంవత్సరం జనవరి లో వచ్చే పండుగల ఇవే...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: