అమ్మవారిని శాకాంబరీ దేవిగా ఆషాడ మాసంలోనే ఎందుకు పూజిస్తారో తెలుసా.. !!

Suma Kallamadi

విజయవాడ పేరు వినగానే గుర్తు వచ్చేది కనకదుర్గమ్మ ఆలయం. అమ్మవారు కనకవర్ణ శోభితురాలై వుండటం వల్ల అమ్మవారికి కనకదుర్గ అనే పేరు వచ్చింది.  ప్రతి ఆషాఢ మాసంలో శాకాంబరీ దేవి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు మూడు రోజులు పాటు ఎంతో ఘనంగా జరుపుతారు. ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీవరకు  శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం పాలక మండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు తెలిపారు.


కరోనా వైరస్‌ పెరుగుతున్న నేపథ్యంలో   శాకంబరి ఉత్సవాలను పరిమిత కూరగాయలతోనే  ఆలయ ప్రాంగణాన్ని అలంకరిస్తామని పేర్కొన్నారు .జులై 5న తెలంగాణ నుంచి జగన్మాత దుర్గమ్మకు బోనాలు తీసుకువస్తారని ఆయన వెల్లడించారు. మొదటి రెండు రోజులు అంతరాలయంలో సాధారణ అలంకరణ, చివరి రోజు ముఖమండపం నుంచి ధ్వజస్తంభం వరకు  కూరగాయలను అలంకరిస్తారు. చివరి రోజు ఉదయం 11 గంటలకు నిర్వహించే పూర్ణాహుతీతో శాకాంబరీ  ఉత్సవాలు ముగుస్తాయి.. జ్యేష్ఠ మాసం తరువాత వచ్చే ఆషాఢ మాసంలో జగన్మాతను శాకంబరీదేవిగా పూజించడం ఆచారం.శాకములు అంటే కూరగాయలు. వివిధ కూరగాయలతో అలంకరించి పూజిస్తాము కనుక ఈ తల్లిని శాకంబరీ దేవి అంటాము.



అమ్మవారు శాకాంబరీ దేవిగా అవతరించడానికి కారణమ ఇదే.. దుర్గమాసురుడనె ఒక రాక్షసుడు బ్రహ్మదేవుని కొసం కొన్ని వందల సంవత్సరాల తపస్సు చేశాడు.బ్రహ్మ ప్రీతిపొంది ప్రత్యక్షం అయ్యి వరం కోరుకోమనగా వేదాలను అందరు మర్చిపొవాలని,వేద జ్ఞానం అంతా తనకే రావలని వరం అడిగాడు.అతి తక్కువ కాలంలొనే అందరు వేదాలను మర్చిపొయారు.యగ్నయాగాదులు లేక దేవతలకు పూజలు లేవు ,తత్ఫలితంగా వర్షాలు కురవడంలేదు.ప్రపంచమంత కరువు  సంభవించింది.అది చూసిన ఋషులు చలించిపొయారు.చివరకు ఋషులు అందరు "సుమేరు పర్వతం"గుహలలోకి వెళ్ళి ఆ జగన్మాతను "అమ్మా!అమ్మా!" అని వేడుకున్నారు.వారి పలుకులను ఆ తల్లి విని వారి ఎదుట ప్రత్యక్షం అయ్యింది.నీలివర్ణంతొ అనేకమైన కళ్ళతో "శతాక్షి"అనే నామంతొ చతుర్భుజములుతొ కనిపించింది.ధనుర్బణాలతొ ఉన్న ఆ తల్లి ఈ దుర్గతిని చూసి 9 రోజులపాటు కన్నుల నీరు కారుస్తూ ఏడ్వసాగింది.


ఆమె కన్నిటితొ ఈ అన్ని నదులు నిండిపొయాయి.ఇక వారి దుస్థితిని చూడలేక అమ్మె శాకంబరిగా అవతరించింది.అమ్మ శరీరభాగాలుగా కూరలను,పండ్లను,గింజలను,గడ్డి మొదలైనవి ఉండగా,తన శరీరభాగలను అంటే శాకములను అన్ని జీవములకు ఇచ్చింది. ఆ  రాక్షసుడును చంపి  అమ్మవారు శాకంబరీదేవిగా ఆవిర్భవించి ఆకలిని తీర్చింది ఆషాఢమాసంలోనే. అందుకే ఆషాఢమాసంలో దేవీక్షేత్రాలలో అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరిస్తారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: