ఈస్టర్ పండుగ చరిత్ర గురించి మీకు తెలుసా...?

క్రైస్తవుల అతి పెద్ద పండుగలలో ఈస్టర్ కూడా ఒకటి. ఏసు క్రీస్తు పునరుజ్జీవనానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. వసంత ఋతువులో ఈ పండుగ వస్తుంది. ఏసు క్రీస్తు శిలువ వేయబడ్డ రోజు, అలాగే సమాధి నుంచి లేచిన రోజును గుర్తు చేసుకుంటూ క్రైస్తవులు ఈస్టర్‌ పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. క్రైస్తవ మత గ్రంథాలను బట్టి క్రీస్తు శిలువవేయబడిన తరువాత తన మరణం నుంచి మూడో రోజున పునరుత్థానం చెందాడని తెలుస్తుంది. 
 
క్రైస్తవులు మరణంపై ఏసు సాధించిన విజయానికి గుర్తుగా ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. గుడ్ ఫ్రైడే గడిచిన రెండు రోజుల తరువాత ఈ పండుగ జరుగుతుంది. క్రీ.శ 26 మరియు క్రీ.శ 36 మధ్య క్రీస్తు మరణం, పునరుత్థానం కాలం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. బైబిల్ నిబంధనల ప్రకారం ఈస్టర్ పండుగ రోజు క్రైస్తవ విశ్వాసానికి పునాది వంటిది. ఈ పండుగ ద్వారా ఏసు క్రీస్తు జీవించే ఆశకు కొత్త జన్మని ప్రసాదించాడని... దేవునిపై విశ్వాసం ఉంటే జీవితం పునరుత్థానం చెంది కొత్త మార్గంలో పయనిస్తారని నమ్మకం. 
 
ఈ పండుగ శనివారం రోజు రాత్రి జాగరణతో ప్రారంభమవుతుంది. శనివారం ఈస్టర్ గుడ్లను రంగులతో అలంకరించి పెద్దలు పిల్లలకు కనిపించకుండా వాటిని దాచిపెడతారు. పిల్లలు ఆదివారం ఉదయం దాచిపెట్టిన గుడ్ల కోసం వెతుకుతారు. ఆదివారం తెల్లవారుజామున సమాధి దగ్గరకు వచ్చే స్త్రీ సువార్తీకులను దృష్టిలో ఉంచుకుని తెల్లవారుజామున ప్రార్థనలు చేస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: