తిరుమల సమాచారం 11-02-2020
ఓం నమో వేంకటేశాయ!!
• ఈరోజు మంగళవారం, 11.02.2020 ఉదయం 6 గంటల సమయానికి, తిరుమల: 16C°-26C°
• నిన్న 76,468 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం లభించింది.
• వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 01 కంపార్ట్మెంట్ లలో సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు.
• ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 06 గంటలు పట్టవచ్చును.
• నిన్న 22,466 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
• నిన్న స్వామివారికి హుండీ లో భక్తులు సమర్పించిన నగదు ₹: 3.16 కోట్లు.
• శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.
గమనిక:
• ఫిబ్రవరి 21న గోగర్భ తీర్థంలోని క్షేత్రపాలకునికి మహాశివరాత్రి వేడుకలు.
• ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించిన టిటిడి.
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్
తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది _కావున లెమ్ము స్వామి.