పల్లెటూర్లలో ఎన్నో పిచ్చి పిచ్చి చెట్లు రోడ్ల మీద ఉంటాయి. వాటిని ఎవ్వరూ పట్టించుకోరు కూడా. కాని వాటిలో కొన్ని ఔషధగుణాలు కలిగి ఉంటాయి. మరికొన్ని చెట్లు అదృష్టంగా భావిస్తుంటారు కొందరు. అయితే ఇలాంటి చెట్టు గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. తెల్ల జిల్లేడు చెట్టు ఈ చెట్టును శ్వేతార్కం అంటారు. వృక్షజాతిలోనే ఎంతో విశిష్టమైన చెట్టు ఈ తెల్లజిల్లేడు. చాలామంది ఈ చెట్టులో విషం దాగి ఉంటుందని అనుకుంటారు. అందుకు ఈ మొక్కలకు కాస్త దూరంగా ఉంటారు.
అలాగే జిల్లేడు పాలు కళ్ళలో పడితే చూపు పోతుందని భయపడతారు. కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే... ఈ మొక్కలో ఉన్న విషంతో ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారుచేస్తున్నారు. జిల్లేడులో రెండు రకాలు ఉంటాయి. జిల్లేడులో మూడు జాతులు ఉన్నాయి. తెల్ల జిల్లేడు, ఎర్ర జిల్లేడు, రాజు జిల్లేడు.. తెల్ల జిల్లేడు ను స్వేతార్క మూలంగా చెప్పుకుంటూ ఇందులో విజ్ఞాలు తొలగించే వినాయకుడు నివశిస్తాడని మన పెద్దలు చెబుతుంటారు. ఇంకా తెల్ల జిల్లేడుతో కలిగే లాభలు ఏమిటంటే.. ఇది హేరంబ గణపతికి ప్రతీక. ఈ తెల్ల జిల్లేడును దొరికించుకుంటే మహాశివుడు, విఘ్నాదిపతుల దయ మనమీద ప్రసరిస్తుందట. తెల్ల జిల్లేడు వేళ్ళ మీద గణపతి నివసిస్తాడు.
ఈ వేళ్ళు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేశుని పోలి ఉంటాయి. అందుకే చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి, తులసి మొక్కలా ఇంట్లో నాటుతారు. ఈ మొక్క గనుక ఉంటే ధన ధాన్యాలు పుష్కలంగా లభిస్తాయని పూర్వీకులు చెబుతున్నారు. స్వేతం అంటే తెలుపు వర్ణంగా అర్కా అంటే సూర్యుడు అని అర్ధం..స్వేతార్కం ను పొందగలిగి ఇంట్లో పూజలు చేయడం వలన మహా గణపతికి పూజలు చేసినట్టు. ఇలా చేయడం వలన ఇంట్లో సిరిసంపదలు, జ్ఞాన సంపద లభిస్తాయి. ఇంట్లో ప్రశాంతంగా లేదనీ, ఎప్పుడూ ఏవో గొడవలు, చికాకులు ఉన్నాయని అనుకున్నవారు ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వలన అంతా మంచే జరుగుతుందని చాలా మంది విశ్వాసం. మనం తులసి మొక్కను ఎలా ఇంట్లో నాటుకొని పూజలు చేస్తున్నామో, అలాగే ఈ మొక్కను కూడా ఈ విధంగా చేయవచ్చు. జిల్లేడు మొక్కలు ఎక్కువగా ఉన్న ఊళ్లలో పంటలు బాగా పండుతాయని, దరిద్రం తొలగిపోతుందని నమ్ముతారు.
అంతేకాక చిన్నపిల్లలు మహిళలు రాత్రి సమయంలో నిద్రపోతూ కలలు కంటుంటారు. అటువంటివారు తెల్ల జిల్లేడు ముక్క వేరును తలగడ కింద పెట్టుకొని పడుకుంటే భయాలన్నీ మాయమయిపోయి,. ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్ప్రభావం చూపకుండా, వారి ప్రయోగాలే నశిస్తాయని ప్రతీతి కూడా దీనికి ఉంది. జాతక దోషం ఉందనీ గ్రహ దోషం ఉందని కొందరు అంటూ ఉంటారు.. ఇటువంటి వారు శ్వేతార్క గణపతిని ఇంటిలో ఉంచి పూజలు చేస్తే మంచిదని చెబుతున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: