తిరుపతి హిందువులకు అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రతిదినం లక్ష నుండి రెండు లక్షల వరకు భక్తులు సందర్శిస్తుంటారు. ప్రత్యేక దినాలలో 5 లక్షలమంది వరకూ దర్శనం చేసుకొంటారు. ఈ యాత్రాస్థలం శ్రీవైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్యదేశాలలో ఒకటి. తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తుల విశ్వాసం. కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలో స్వయంభువుగా అవతరించాడని భవిష్యోత్తరపురాణం లోని శ్రీ వేంకటాచల మహత్యం కథనం. తిరుమల వేంకటేశ్వరుని శ్రీనివాసుడు, బాలాజీ అని కూడా పిలుస్తారు. శ్రీవారు అని కూడా అంటారు. ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం ! మొట్ట మొదటగా, వైఖానస అర్చకుడు శ్రీ మాన్ గోపీనాథ దీక్షితుల వారు (శ్రీ వేంకటాచల మహాత్యం అనుసరించి), శ్రీవారి మూర్తిని స్వామి పుష్కరిణి చెంత, చింత చెట్టు క్రింది చీమల పుట్టలో కనుగొని, శ్రీవారి మూర్తిని ప్రస్తుతం వున్న ప్రదేశంలో ప్రతిష్ఠించి, అర్చించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి.
ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం ! అప్పటి నుండి శ్రీ గోపీనాథ దీక్షితుల యొక్క వంశీయులే పరంపరగా స్వామి వారి పూజా కైంకర్యాల నిర్వహణ చేస్తున్నారు. తిరుమల ఆలయం లోని మొదటి ప్రాకారం (విమాన ప్రాకారం), ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు.దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వేంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాభ్దానికి చెందిన చోళులు (తంజావురు) పాండ్య రాజులు (మదురై), 13-14 శతాభ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి.
విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది, ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతులైన శ్రీ కృష్ణదేవ రాయలు, రాజా తోడరమల్లు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. కలియుగప్రత్యక్షదైవం తిరుమలవేంకటేశ్వరుడి గురించి ఎంత చెప్పినా తక్కువే.ముక్కోటిదేవతలతో పూజలందుకునే దేవదేవుడు కొలువైన సప్తగిరుల గురించి తెలుసుకోవలసినది ఎంతోవుంది. ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం ! శ్రీమహావిష్ణువు స్వయంభూవుడై అవతరించిన నిత్యకళ్యాణం,పచ్చతోరణంతో అలరాడే తిరుమలనాథుని దేవతలు రహస్యంగా దర్శించి ప్రత్యేకపూజలు చేసి వెళుతుంటారని నమ్ముతాం.ఇదే విషయం గురించి ఆలయాలప్రధానార్చకులు రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేసారు.తిరుమలపై ఒక టివిఛానల్ రూపొందించిన కార్యక్రమంలో భక్తులవూహకందని విషయాలను ఆయన వెల్లడించాడు.
మరింత సమాచారం తెలుసుకోండి: