క్రిస్మస్ ను క్రైస్తవులే కాదు హిందువులు కూడా అలా జరుపుకుంటారు.?
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగను క్రైస్తవులు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. డిసెంబర్ 25న క్రిస్టియన్ ఆరాధ్యదైవమైన ఏసు పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అంబరాన్నంటేలా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. డిసెంబర్ 25న ప్రతి ఏడాది క్రిస్మస్ జరుపుకోవడానికి కొన్ని రోజుల నుండి ప్రీ క్రిస్మస్ వేడుకలు ప్రతి క్రైస్తవుడు ఇంట్లో మొదలవుతాయి. తన ఇల్లు పరిసరాలన్నీ రంగు రంగులుగా తీర్చిదిద్దుకుణి .. వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవులందరికీ వేడుకల్లో పాల్గొని ఒకరికొకరు బహుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. క్రిస్మస్ పర్వదినం సందర్బంగా శాంతా క్లాస్ వచ్చి అందరికి బహుమతులు ఇచ్చి వెళ్తాడని క్రిస్టియన్స్ గట్టిగా నమ్ముతారు.
లోక రక్షకుడైన యేసు ప్రభువు... ఈ లోకాన్ని అంతా రక్షించేందుకు మనుషుల పాపాలను కడిగేసేందుకు జన్మించబడ్డాడని క్రైస్తవులు బలంగా నమ్ముతున్నారు. ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభువుని బలంగా నమ్మి ఆరాధ్య దైవంగా పూజించే క్రైస్తవులు చాలామందే ఉన్నారు. పాశ్చాత్య దేశాల ప్రజలు అందరూ ఎక్కువగా ఏసుక్రీస్తు నే నమ్ముతూ పూజిస్తుంటారు . అయితే డిసెంబర్ 25న ఏసుక్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా అంగరంగ వైభవంగా వేడుకలను జరుపుకుంటారు క్రైస్తవులు. ఏసు పుట్టిన రోజు నాడు చర్చ్ లని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారు. క్రిస్మస్ పండగకు కొన్ని రోజుల ముందు నుండి చర్చిలన్నీ క్రైస్తవులతో జనసంద్రంగా కనిపిస్తూ ఉంటాయి.
సెప్టెంబర్ 25 న ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన సాంస్కృతిక పండుగ ఈ క్రిస్మస్. అయితే క్రైస్తవులు క్రిస్మస్ పండుగని మతపరంగా జరుపుకుంటే... క్రైస్తవేతరులు కూడా సాంస్కృతికంగా క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా క్రిస్మస్ పండగలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది క్రిస్మస్ చెట్టు. క్రిస్మస్ చెట్టు అంటే రంగురంగుల వెలుగులతో అలంకరించబడిన చెట్టు అని అర్థం. క్రిస్మస్ పండుగ నేపథ్యంలో ప్రీ క్రిస్మస్ చెట్టును పలు రకాల పండ్లు గింజలు విత్తనాలు వంటి తినదగిన ఆహార పదార్థాలతో సుందరంగా అలంకరిస్తారు. ఏసుప్రభు ఎప్పుడు తమ పాపాలను హరింప చేయడానికి.. తన వెంటే ఉంటాడు అని క్రైస్తవులు బలంగా నమ్ముతున్నారు.