తెలంగాణ తిరుపతి కి బంగారు రథం
తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదగిరిగుట్ట లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు ఇక నుంచి బంగారు రథంలో విహరించనున్నాడు. స్వామి వారికి బంగారు రథం తయారు చేయించేందుకు ఆ దేవస్థాన అధికారులు రెడీ అయ్యారు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరులోని శ్రీకన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి బంగారు రథాన్ని దేవస్థానం ఛైర్మన్ నరసింహ మూర్తి, ఈఓ గీతారెడ్డి, మరియు ఇతర దేవస్థాన అధికారులు సందర్శించారు దానిని గోపాలకృష్ణమూర్తి అనే పారిశ్రామికవేత్త చేయించారు. ఇదే నమూనాలో ఉన్న బంగారు రథాన్ని యాదాద్రీశునికి కూడా తయారు చేయించి ఇస్తానని గోపాలకృష్ణమూర్తి ఆలయ ఈవోకు తెలిపారు. ఆలయ ఈవో ఎన్. గీత, అనువంశిక ధర్మకర్త బీ. నర్సింహమూర్తిలను శ్రీకన్యకాపరమేశ్వరి చేరుకుని అక్కడున్న బంగారు రథాన్ని వారు పరిశీలించారు.స్వామివారి కోసం ఇప్పటికే రథం తయారు చేయించామని దానికి బంగారు తాపడం చేయిస్తే బాగుంటుందని ఈవో గీత ఆయనకు తెలిపారు. గోపాలకృష్ణమూర్తి బంగారు రథాన్ని తయారు చేయించి శ్రీవారికి సమర్పిస్తామని హామీ ఇచ్చారని మొత్తం రూ.25 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఈవో తెలిపారు.